Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోలీవుడ్ సినీ నిర్మాతలను టార్గెట్ చేసిన ఆదాయపన్ను శాఖ

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2022 (12:01 IST)
తమిళ చిత్రంలోని పలువురు బడా నిర్మాతలను ఆదాయపన్ను శాఖ టార్గెట్ చేసింది. ప్రముఖ పైనాన్షియర్ అన్బుచెళిన్, బడా నిర్మాత కలైపులి ఎస్.థాను, డ్రీమ్ వారియర్ పిక్సస్ అధినేతలు ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు, స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్ రాజా తదితలు ఇళ్లు కార్యాలయాల్లో మంగళవారం ఉదయం ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తుంది. 
 
ముఖ్యంగా మదురైకి చెందిన ప్రముఖ బడా ఫైనాన్షియర్ అన్బుచెళియన్ సినిమా ఫైనాన్షియర్. గోపురం సినిమాస్ అనే నిర్మాణ సంస్థను కూడా నడుపుతున్నారు. ఈయన అనేక చిత్రాలకు ఫైనాన్స్ చేస్తున్నారు. ఈ కేసులో ఈరోజు (ఆగస్టు 2) ఉదయం నుంచి మదురై, చెన్నైలోని ఆయన ఇళ్లు, కార్యాలయాలతో పాటు అన్బుచెళియన్‌కు చెందిన 40కి పైగా చోట్ల ఆదాయపు పన్ను శాఖ దాడులు చేస్తోంది. 
 
అలాగే, నిర్మాతలు ఎస్.థాను, ఎస్.ఆర్.ప్రభు ఇళ్లపైనా ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. త్యాగరాయనగర్ ప్రకాశం రోడ్డులోని థాను కార్యాలయంపై కూడా దాడి చేశారు. మరికొంత మంది తయారీదారులు కూడా అధికారుల పరిశీలన జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఆదాయపన్ను శాఖ అధికారులు ఒక్కసారిగా కోలీవుడ్ నిర్మాతలపై పడటం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

సివిల్ కేసుల్లో పోలీసుల జోక్యమా: కోర్టు అసహనం

నాకు దక్కని ఆమె మరెవ్వరికీ దక్కకూడదు .. ప్రియుడి కిరాతక చర్య

తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్: రూ.5లకే ఇడ్లీ, పూరీ, వడ, ఉప్మా, పొంగల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments