Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదం: అర్జున్ రెడ్డి సినిమా డిస్ట్రిబ్యూటర్ కమలాకర్ రెడ్డి మృతి

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (17:12 IST)
Kamalakar Reddy
ఒకవైపు కరోనా.. మరోవైపు రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే నిర్మాతలు, దర్శకులు, నటులు, గాయకులు కరోనా సోకడంతో నానా తంటాలు పడుతున్నారు. తాజాగా తెలుగు బ్లాక్ బస్టర్ చిత్రాలు ‘అర్జున్‌రెడ్డి’, ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాలకు డిస్ట్రీబూటర్‌, కేఎఫ్‌సీ నిర్మాణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌లలో ఒకరైన గుండాల కమలాకర్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లాలో నివాసముంటున్న కమలాకర్‌రెడ్డి ఆయన తండ్రి నందగోపాల్‌రెడ్డి (75) ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఆయనను హైదరాబాద్‌లోని ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో అంబులెన్స్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్ డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
ఇకపోతే రోడ్డు ప్రమాదంలో తండ్రీకుమారులు ఇద్దరూ మృత్యువాత పడటడంతో వారి కుటుంబం విషాదం నెలకొంది. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇటీవల విడుదలైన ''కనులు కనులు దోచాయంటే'' సినిమాను కేఎఫ్‌సి ఎంటర్‌టైన్మెంట్ సంస్థ విడుదల చేసింది. ఈ సినిమాకు కమలాకర్‌రెడ్డి కో ప్రోడ్యూసర్‌గా వ్యవహరించారు. అలాగే తెలుగు, హిందీ, తమిళ డబ్బింగ్‌ సినిమాలకు కూడా ఆయన డిస్ట్రిబుటర్‌గా వ్యవహరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సంక్రాంతికి సిద్ధం అవుతున్న పవన్ కల్యాణ్ ప్రభలు, ఉత్తరాంధ్రలో ఉరుకుతున్న జనం (Video)

Truck: ట్రక్కు కింద ఇద్దరు మోటర్ సైకిలిస్టులు.. చూడకుండానే లాక్కెళ్లిన డ్రైవర్ (video)

NTR: ఎందుకొచ్చిన గొడవ- అభిమాని ఆస్పత్రి బిల్ సెటిల్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. (video)

అరకు వ్యాలీలో అద్దంలాంటి రహదారులు... డిప్యూటీ సీఎంపై ప్రశంసలు

ఏపీ ఫైబర్‌ నెట్ నుంచి 410 మంది ఉద్యోగులపై వేటు.. జీవీ రెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments