లావణ్య త్రిపాఠి.. చావుకబురు చల్లగా చెప్పింది..?

Webdunia
శనివారం, 24 అక్టోబరు 2020 (20:20 IST)
Lavanya Tripathi
లావణ్య త్రిపాఠి.. చావుకబురు చల్లగా చెప్పింది..? అదేంటో అనుకునేరు. అదీ ఆమె చేసే సినిమా. ''చావుకబురు చల్లగా' చిత్రంలో కథానాయికగా చేస్తోన్న లావణ్య త్రిపాఠి.. మల్లిక పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. 
 
దీనికి సంబంధించిన ఫస్ట్​లుక్ పోస్టర్​ను విడుదల చేసింది. కథానాయకుడిగా యంగ్​ హీరో కార్తికేయ నటిస్తున్నాడు. బస్తీ బాలరాజు పాత్రలో కార్తికేయ ప్రేక్షకుల మందుకు వస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే పేర్కొంది.
 
సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్​ను నటీమణి లావణ్య త్రిపాఠి తన ట్విట్టర్​ ఖాతాలో పోస్ట్ చేసింది. మల్లిక పాత్ర చాలా ఆసక్తిగా ఉంటుందని కాప్షన్​ పెట్టింది. ఈ సినిమాకు కౌశిక్​ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. 
 
తాజాగా విడుదలైన లావణ్య లుక్‌లో మిడిల్ క్లాస్ అమ్మాయి లుక్‌లో లావణ్య కనిపిస్తోంది. ఆమె లుక్ చూస్తుంటే ఇదేదో లేడి ఓరియెంటెడ్ రోల్‌లో లావణ్య కనిపించబోతుందనే అనుమానం రాక తప్పదు. అయితే కార్తికేయ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. మరి వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమా ఎలా వుంటుందోనని ప్రేక్షకులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vizag: కైలాసగిరి కొండలపై కాంటిలివర్ గాజు వంతెన ప్రారంభం

ఐదేళ్ల చిన్నారిపై పాశవికంగా దాడి చేసిన ఆయా

మహిళా వ్యాపారవేత్తను తుపాకీతో బెదిరించి, దుస్తులు విప్పించి లైంగిక వేధింపులు..

భర్తను హత్య చేసిన భార్య.. గొడవలే గొడవలు.. ఇంట్లోకి రానివ్వకపోవడంతో..?

కుమార్తెను ప్రేమిస్తున్నాడనీ యువకుడిని చంపేశారు... అయినా శవాన్నే పెళ్లి చేసుకున్న యువతి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments