Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పీపీఈ కిట్‌ ధరించి జర్నీ చేశా.. ఇంట్లో కూడా మాస్క్ తప్పనిసరి: లావణ్య త్రిపాఠి

Advertiesment
Lavanya Tripathi
, గురువారం, 20 ఆగస్టు 2020 (10:10 IST)
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అందరూ ఇంటికే పరిమితం అయ్యారు. సెలెబ్రిటీల దగ్గర నుంచి సామాన్య ప్రజల వరకు లాక్ డౌన్ కారణంగా ఇంటిపట్టునే వుండిపోయారు. ఇలా లాక్‌డౌన్‌ కారణంగా హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి తన అనుభవాలను పంచుకుంది. లాక్‌డౌన్‌ కారణంగా హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఆమె ఆరు నెలల విరామం తర్వాత ఇటీవలే స్వస్థలం డెహ్రాడూన్‌కు వెళ్లింది. 
 
ఒంటరితనాన్ని తానెప్పుడూ ఇబ్బందిగా భావించలేదని.. స్వాతంత్ర్యంగా బతకాలనే ఆలోచనతో పదహారేళ్ల వయసులోనే కుటుంబాన్ని విడిచి ఒంటరిగా తన ప్రయాణాన్ని మొదలెట్టినట్లు వెల్లడించింది. లాక్‌డౌన్‌ సమయంలో హైదరాబాద్‌లో చిక్కుకుపోయానని భయపడలేదు. తనలోని నైపుణ్యాలను మెరుగులు దిద్దుకోవడంపై ఈ విరామంలో దృష్టిపెట్టానని చెప్పింది. ఒంటరిననే ఆలోచనను ఏ రోజు తన మనసులోకి రానివ్వలేదని లావణ్య చెప్పుకొచ్చింది. 
 
జనవరిలో చివరిసారిగా కుటుంబసభ్యుల్ని కలిశానని... ఆరు నెలల పాటు వారికి దూరంగా ఉండటం వెలితిగా అనిపించింది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో డెహ్రాడూన్‌ వెళ్లడానికి చాలా భయపడ్డాను. 
 
అనుకోకుండా తాను వైరస్‌ బారిన పడితే తన వల్ల కుటుంబసభ్యులు ఇబ్బందులు పడకూడదనే పీపీఈకిట్‌ ధరించి ప్రయాణించానని తెలిపింది. స్వస్థలం చేరుకోగానే కరోనా టెస్ట్‌ చేయించుకున్నా. నెగెటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. అయినా ముందు జాగ్రత్తగా ఇప్పటికీ ఇంట్లో మాస్కు ధరిస్తున్నానని లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#GrowWithMe Challenge విసిరిన సమంత అక్కినేని