Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణ‌వంశీ రుద్రాక్ష ఖ‌రారైంది కానీ... మీడియాకి షాక్ ఇచ్చిన కృష్ణ‌వంశీ..!

Webdunia
మంగళవారం, 25 జూన్ 2019 (14:36 IST)
క్రియేటీవ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ న‌క్ష‌త్రం సినిమా వ‌చ్చి వెళ్లింది. చాలా రోజులు కాదు... నెల‌లు సంవ‌త్స‌రాలు కూడా అయ్యాయి కానీ... ఇప్ప‌టివ‌ర‌కు కృష్ణ‌వంశీ త‌దుప‌రి చిత్రం ఏంటి అనేది ఎనౌన్స్ చేయ‌లేదు. బాల‌య్య‌తో రైతు అనే సినిమా చేయ‌నున్న‌ట్టు గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి అవి వార్త‌లుగానే మిగ‌లిపోయాయి త‌ప్ప నిజం కాలేదు. ఆ త‌ర్వాత ఆయ‌న రుద్రాక్ష అనే సినిమా తీయ‌నున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి.. వ‌స్తున్నాయి కానీ.. అఫిషియ‌ల్‌గా ఎలాంటి ఎనౌన్స్‌మెంట్ రాలేదు. 
 
అభిరుచి గ‌ల నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మించ‌నున్నార‌ని.. స‌మంత ప్ర‌ధాన పాత్ర పోషించ‌నుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఆ త‌ర్వాత ఈ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. చాలా రోజులు త‌ర్వాత ఇప్పుడు మ‌ళ్లీ రుద్రాక్ష వార్త‌ల్లోకి వ‌చ్చింది. తాజా వార్త ఏంటంటే.. ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయ్యింది. 
 
బ్లాక్ బ‌ష్ట‌ర్ ప్రొడ్యూస‌ర్ బండ్ల గ‌ణేష్ ఈ సినిమాని భారీ స్ధాయిలో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం మంచి క్రేజ్ వున్న కథానాయికల నుంచి ఒకరిని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. హీరోయిన్ క‌న్ఫ‌ర్మ్ అయితే..  వెంటనే అధికారిక ప్రకటన చేయనున్నట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. మీడియాలో వ‌చ్చిన ఈ వార్త‌లపై కృష్ణ‌వంశీ స్పందించారు. నా గురించి నేనే చెబుతాను. నేను చెప్పే వ‌ర‌కు నా గురించి ఎలాంటి వార్త‌లు వ‌చ్చినా న‌మ్మ‌ద్దు అని చెప్పారు. అంటే... ప్ర‌చారంలో ఉన్న రుద్రాక్ష ఇంకా క‌న్ఫ‌ర్మ్ కాలేద‌ని తెలుస్తుంది. ఈ విధంగా స్పందించి కృష్ణ‌వంశీ మీడియాకి షాక్ ఇచ్చారు. మ‌రి... త‌దుప‌రి చిత్రాన్ని ఎప్పుడు ప్ర‌క‌టిస్తారో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా మేనేజర్‌తో నా భార్య మాట్లాడింది కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేసిండు: కౌశిక్ రెడ్డి (video)

మరొకరితో ప్రియురాలు సన్నిహితం, నువ్వు అందంగా వుండటం వల్లేగా అంటూ చంపేసాడు

తిరుమల ఘాట్ రోడ్డు.. సైకిల్‌పై వెళ్తున్న జంటపై చిరుత దాడి వీడియో వైరల్ (video)

బాలికపై అత్యాచారం.. గర్భవతి అని తెలియగానే సజీవంగా పాతిపెట్టేందుకు...

ప్రపంచ వారసత్వ ప్రదేశాల తుది జాబితాలో లేపాక్షి, గండికోట చేర్చాలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments