Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగర్ సీమంతం ఫోటోలు, వీడియోలు వైరల్...

Webdunia
మంగళవారం, 25 జూన్ 2019 (13:36 IST)
టాలీవుడ్‌లో టాప్ సింగర్‌గా వెలుగొందిన గీతామాధురి సీమంతం ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్‌లో సింగర్‌గా పరిచయమయ్యాక ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.


దాదాపు పదేళ్లుగా సాగుతున్న గీతామాధురి కెరీర్‌లో ఇప్పటి వరకు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషలు అన్నింట్లో కలిపి దాదాపు 550 పాటల వరకు పాడింది. కొన్ని సినిమాలలో ఆమె పాడిన పాటలకు అవార్డులు సైతం దక్కాయి. ఇక గత సంవత్సరంలో ఆమె 'బిగ్ బాస్ 2' అనే రియాల్టీ షో‌లో పాల్గొని ఫైనల్స్‌కు చేరుకుంది. దీంతో ప్రజలలో ఆమె పాపులారిటీ మరింతగా పెరిగిపోయింది.
 
టాలీవుడ్ యాక్టర్ నందును ప్రేమించిన తర్వాత ఫిబ్రవరి 9, 2014లో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే గీతామాధురి గర్భవతి అనే విషయాన్ని ఆమె గానీ, ఆమె భర్త గానీ ఎవరూ వెల్లడించలేదు. కానీ ఆమె సీమంతానికి సంబంధించిన కొన్ని పిక్స్ బయటకు రావడంతో గీతామాధురి గర్భవతి అని అందరికీ తెలిసిపోయింది.

దీనితో పాటుగా వీడియో కూడా వైరల్ కావడంతో నెటిజన్ల దృష్టిని తెగ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో గీతామాధురి సీమంతం వేడుకలు సాంప్రదాయబద్ధంగా కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో ఘనంగా జరిగినట్లుగా తెలుస్తోంది.

తాజాగా యూట్యూబ్‌లో వైరల్ అవుతున్న గీతామాధురి సీమంతం వీడియోలో నందు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటుగా సింగర్స్ అంజనా సౌమ్య, మాళవిక, యాంకర్ శ్యామల కనిపించారు. ఈ వీడియో చూసిన అభిమానులంతా గీతా మాధురి దంపతులకు పండంటి బిడ్డ పుట్టాలని కోరుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డెలివరీ బాయ్ గలీజు పనిచేశాడు... లిఫ్టులో మూత్ర విసర్జన

మెస్‌‌లో వడ్డించే అన్నంలో పురుగులు.. ఆంధ్రా వర్శిటీ విద్యార్థుల నిరసన

Solar Eclipse In 100 Years : ప్రపంచం మొత్తం చీకటైపోతే ఎలా ఉంటుంది?

భారత గగనతలంపై పాకిస్థాన్ విమానాలపై నిషేధం పొడగింపు

Nara Lokesh: మంగళగిరిలో పెట్టుబడులు పెట్టడానికి ఐటీ కంపెనీలు సిద్ధంగా వున్నాయ్: నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం