Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాబు ప్రతిపక్ష హోదా గల్లంతు... భాజపా పక్కా స్కెచ్, 16 మంది తెదేపా ఎమ్మెల్యేలు?

Advertiesment
BJP
, శుక్రవారం, 21 జూన్ 2019 (14:35 IST)
భాజపా పక్కా స్కెచ్ వేసేసి ఇప్పటికే రాజ్యసభ సభ్యులను పార్టీలో చేర్చుకుని రాజ్యసభలో తెదేపా ప్రాతినిధ్యం లేకుండా చేసేసింది. ఇక ఇప్పుడు దాని కన్ను ఏపీ అసెంబ్లీలోని తెదేపా ఎమ్మెల్యేలపై పడింది. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు కాలికి బలపం కట్టుకుని ప్రధానమంత్రి మోదీకి వ్యతిరేకంగా తృతీయ శక్తిని కూడగట్టేందుకు ప్రయత్నాలు చేశారు. 
 
దీన్ని మనసులో పెట్టుకున్న భాజపా చంద్రబాబుకి దెబ్బకి దెబ్బ తీయాలన్న గట్టి నిర్ణయంతో వున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే తెదేపాకి చెందిన రాజ్యసభ సభ్యులను లాగేసింది. తాజాగా ఎమ్మెల్యేలను కూడా లాగేస్తే ఓ పనైపోతుందని భాజపా తగిన రీతిలో పావులు కదుపుతోంది.
 
కాగా వైసీపి అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి తెదేపాకి చెందిన ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో వున్నారనీ, ఐతే వారిని చేర్చుకోవాలంటే వారు తమ పదవులకి రాజీనామా చేసి రావాల్సిందేనని కండిషన్ పెట్టారు. దీనితో ఇక తెదేపా ఎమ్మెల్యేల్లో ఎవరైనా గోడ దూకాలంటే వైసీపితో పనికాదు. కాబట్టి కేంద్రంలో అధికారంలో వున్న భాజపా వారికి దిక్కు. అందువల్ల కొందరు ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
పైగా వచ్చే ఐదేళ్లపాటు అధికారానికి దూరంగా వుండాలంటే చాలా కష్టం. అభివృద్ధి సంగతేమోగానీ కనీసం సొంత పనులు కూడా చేసుకోలేని పరిస్థితి నెలకొంటుంది. అందువల్ల తెదేపాను వీడేందుకు కొందరు మొగ్గుచూపుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఐతే నలుగురైదుగురు ఎమ్మెల్యేలు వచ్చినా ప్రయోజనం వుండదనీ, 23 మంది ఎమ్మెల్యేల్లో కనీసం 15 మంది ఎమ్మెల్యేలను తమవైపు లాక్కోవాలని భాజపా ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. అదే జరిగితే చంద్రబాబు నాయుడుకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా గల్లంతవుతుంది. కేవలం సాధారణ ఎమ్మెల్యే మాదిరిగా కొనసాగాల్సి వుంటుంది. 
 
15 మందికిపైగా తెదేపా శాసనసభ్యులు పార్టీ మారితే... రాజ్యసభ సభ్యులు మాదిరిగా వీరు కూడా తమ పార్టీని భాజపాలో విలీనం చేయాలని విజ్ఞప్తి చేస్తే... ఇక తెదేపా పని మటాష్. చంద్రబాబు నాయుడు పరిస్థితి అగమ్యగోచరమే. మరి భాజపా వలలో ఎంతమంది పడుతారో... తెదేపా కోసం ఎంతమంది నిలిచి వుంటారో చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్యూనీషియాలో 11 మంది చిన్నారుల మృతి... హెల్త్ మినిస్టర్ రిజైన్