టీడీపీ మునిగిపోయే పడవ... దాన్ని లేపే శక్తి ఎవరికీ లేదు... లోకేష్ ఉంటే ఆ పడవ మునగడమే తప్ప ఎప్పటికీ తేలదు. వచ్చే 15 యేళ్లు బీజేపీదే భవిష్యత్తు. భవిషత్తు కావాలనుకుంటే బీజేపీతో వెళ్లడమే మేలు. ఇదీ కొంతమంది తెదేపా నాయకుల ధోరణి.
ఇది చాలదన్నట్లు తెదేపాకి చెందిన ఎంపీలు కట్టకట్టుకుని భాజపాలో చేరిపోనున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ బాబుతో ఇక పార్టీ లేవలేని స్టేజీకి వెళ్లిపోవడం ఖాయం కనుక ఇక ఆ పార్టీలో వుండి ఏమీ ప్రయోజనం లేదని కొంతమంది తెదేపా నాయకులు అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.