Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు ఇండస్ట్రీని చూసి వణికిపోతున్నారు : కృష్ణంరాజు

Webdunia
గురువారం, 2 జనవరి 2020 (17:21 IST)
ఒకపుడు భారత చలన చిత్రపరిశ్రమను బాలీవుడ్ ఇండస్ట్రీ శాసించిందనీ, ఇపుడు తెలుగు ఇండస్ట్రీని చూసి ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారని రెబల్ స్టార్ కృష్ణంరాజు చెప్పుకొచ్చారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) డైరీ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో కృష్ణంరాజు పాల్గొని ప్రసంగించారు. తాము చెన్నైలో తెలుగు ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నామని, దివిసీమలో ఉప్పెన వచ్చినప్పుడు వివిధ రకాల సహాయ కార్యక్రమాలు చేపట్టామన్నారు. 
 
ఇపుడు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) పేరిట ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తాను పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఒకపుడు సినీ ఇండస్ట్రీని బాలీవుడ్ శాసించిందనీ, ఇపుడు టాలీవుడ్ ఆ స్థాయికి చేరుకుందన్నారు. ఎందుకంటే... తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అనేక హీరోలు ఇంటర్నేషనల్ స్థాయికి చేరగా, మరికొందరు బాలీవుడ్ రేంజ్‌కు ఎదిగారన్నారు. బాహుబలి, సాహో, సైరా వంటి చిత్రాలతో ఈ విషయం తేటతెల్లమైందన్నారు. అందువల్ల తెలుగు సినీ ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్లిందన్నారు. 
 
అలాగే, ఈ సభలో జరిగిన వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని వ్యాఖ్యలు చేశారు. సమస్యలు ఎక్కడైనా ఉంటాయని, తమవంటి పెద్దలను పిలిచి సామరస్య ధోరణిలో పరిష్కరించుకోవాలని హితవు పలికారు. వివాదాలను బహిర్గతం చేసుకోరాదని, 'మా' గౌరవాన్ని కాపాడుకోవాలని అన్నారు. వివాదాల పరిష్కారం కోసం ఓ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసుకోవడం మంచిదని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments