Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంట్లో కట్టేసిన కుక్కలమో.. బర్రెలమో కాదు.. మీడియాకు జీవిత వార్నింగ్

Advertiesment
Maa Dairy inaguration
, గురువారం, 2 జనవరి 2020 (16:58 IST)
మీడియాకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జీవిత రాజశేఖర్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మీడియాకు వార్తలు రాసే పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు. అలాగనీ, తమ వ్యక్తిగత విషయాలను రచ్చకీడ్చే అధికారం మీడియాకు లేదని అభిప్రాయపడ్డారు. 
 
హైదరాబాద్ నగరంలోని పార్క్ హయత్ హోటల్‌లో గురువారం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కార్యక్రమం జరిగింది. ఇందులో జీవిత రాజశేఖర్ తన భర్త, హీరో రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. 'మాలో గొడవలు జరిగితే మా కంటే ముందు మీడియాకే తెలుస్తుంది. ఇందులో దాచాల్సింది ఏదీ లేదు. ప్రతి చోట గొడవలు ఉంటాయి. మేము కూడా అందరిలా మనుషులమే. 
 
సోషల్ మీడియా, మీడియాల్లో ఎన్నో రాస్తుంటారు. మేము మీ ఇంట్లో కట్టేసిన కుక్కలమో, బర్రెలమో కాదు. మాపై ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేయొద్దు. కావాలంటే మా సినిమాలపై మీరు కామెంట్లు చేయొచ్చు. వ్యక్తిగతంగా మాత్రం విమర్శలు చేయవద్దు. మీ అందరికీ తెలుసు రాజశేఖర్ గురించి. ఆయన మనసులో ఏముందో అది చెప్పడం తప్ప ఆయనకు మనసులో ఏదో దాచుకోవడం తెలియదు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఓ కిడ్. 
 
ఇక్కడ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ పరిష్కరించుకోవాలి. అందుకే రాజశేఖర్ ఇలా మాట్లాడారు. నరేశ్‌కి కూడా నేను ఇదే చెబుతున్నాను. అందరితో కలిసి మేము పని చేస్తాం. ఇది జస్ట్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం. 'మా'ను చిరంజీవి ముందుండి నడిపించాలి' అని జీవిత అన్నారు. లోపాలు ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలని, బయటకు తీసుకురావద్దని అన్నారు. తన భర్త రాజశేఖర్ సృష్టించిన వివాదంపై తాను సారీ చెబుతున్నట్టు జీవిత పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కారు ప్రమాదానికి 'మా' వివాదమే... రాజశేఖర్ :: క్రమశిక్షణా చర్యలు తీసుకోండి.. చిరు