Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కారు ప్రమాదానికి 'మా' వివాదమే... రాజశేఖర్ :: క్రమశిక్షణా చర్యలు తీసుకోండి.. చిరు

కారు ప్రమాదానికి 'మా' వివాదమే... రాజశేఖర్ :: క్రమశిక్షణా చర్యలు తీసుకోండి.. చిరు
, గురువారం, 2 జనవరి 2020 (16:38 IST)
మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం మరో వివాదానికి కారణమైంది. తన కారు ప్రమాదానికి కారణం మా వివాదమేనంటూ హీరో రాజశేఖర్ బాంబు పేల్చారు. పైగా, చిరంజీవి ప్రసంగాన్ని రాజశేఖర్ అడ్డుకున్నారు. ఆయన చేతిలో నుంచి మైకును లాక్కొన్నారు. నిప్పు లేనిదే పొగరాదన్నారు. నిజాలు దాచిపెట్టలేమంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. 
 
హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో రాజశేఖర్ స్పందిస్తూ, తన కారు ప్రమాదానికి కూడా 'మా' పరిస్థితే కారణమని అన్నారు. చిరంజీవి ప్రసంగాన్ని కూడా తప్పుబట్టారు. దాచిపెట్టినంత మాత్రాన నిజాలు దాగవని అన్నారు. తాను అన్నీ నిజాలు మాత్రమే చెబుతున్నానని తెలిపారు.
 
సభలో జరిగిన ఈ వివాదం పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. 'నేను చెప్పిందేమిటి... మంచి ఉంటే మైక్‌లో చెప్పండి, చెడు ఉంటే చెవిలో చెప్పండని అన్నాను. ఆ మాటలను గౌరవించనప్పుడు, ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటనిపిస్తోంది. బయటి ప్రపంచానికి మన బలహీనతను చెప్పుకోవడం తప్ప ఈ గొడవ వల్ల ఒరిగిందేమిటి? ఎంతో సజావుగా సాగుతున్న ఈ సభలో దురుసుగా మైక్ లాక్కుని మాట్లాడడం ఏం మర్యాద? 
 
ఇప్పటికీ నేను స్పందించకపోతే నా పెద్దరికానికి విలువ లేదు. ఎంత సౌమ్యంగా మాట్లాడదామనుకున్నా సరే, నాతో కూడా ఆవేశంగా మాట్లాడిస్తున్నారు. దయచేసి దీన్ని ఇంతటితో ఆపేసి మంచిగా మాట్లాడుకుందాం. మనం ఏం చేద్దామో ఆలోచించండి. ఇది ఇష్టం లేనివాళ్లు రావడం ఎందుకు?' అంటూ ఉద్వేగభరితంగా ప్రసంగించారు.
 
దాంతో రాజశేఖర్ మధ్యలో వచ్చి, "నిజాలను కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోంది. నేను నిజాలు మాట్లాడకుండా ఉండలేను. నేను ఆ విధంగా బతకలేను" అంటూ తన వాదన వినిపించారు. దాంతో చిరంజీవి స్పందిస్తూ, ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన వివాదంలా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.
 
"ఈ సభను ముందే చెడగొట్టాలని ప్రణాళికతో వచ్చారు కనుక మనం అలాంటివాళ్లకు ఏం సమాధానం చెప్పగలం? దీనికి ఏదైనా క్రమశిక్షణ చర్యలు ఉంటే గనుక తప్పనిసరిగా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను" అంటూ బదులిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్తకు మస్కా... సహచర వైద్య విద్యార్థితో లేచిపోయిన మహిళా వైద్యురాలు