Webdunia - Bharat's app for daily news and videos

Install App

#కైరాతో మరోసారి రాంచరణ్.. మెగాస్టార్ చిరంజీవి మూవీలో..?

Webdunia
సోమవారం, 13 జనవరి 2020 (16:40 IST)
బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ రామ్ చరణ్ సరసన రెండోసారి కలిసి నటించనుంది. ఇప్పటికే వినయ విధేయ రామ చిత్రంలో చెర్రీ కలిసి నటించిన కైరా.. మళ్లీ అతనితో జోడీ కట్టే ఛాన్సుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో చెర్రీ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో చెర్రీకి కథానాయికగా కైరా అద్వానీని ఎంపిక చేస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. 
 
కాగా కైరా అద్వానీ.. టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు లాంటి సూప‌ర్ స్టార్ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ ఒక్క సినిమాతోనే తెలుగులో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఆ సినిమా హిట్ తర్వాత.. రామ్ చ‌ర‌ణ్ సరసన 'విన‌య విధేయ రామ'లోనూ తన అందచందాలతో భాగానే ప్రేక్షకుల్నీ ఆకర్షించింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి.
 
అయినప్పటికీ హిందీలో ఈ భామ 'అర్జున్ రెడ్డి' రీమేక్.. 'కబీర్ సింగ్‌'లో చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం.. లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న ''లక్ష్మీబాంబ్‌'' అనే ఓ హారర్ కామేడీలో నటిస్తోంది. తాజాగా ఈ భామ నటించిన గుడ్ న్యూజ్ సూపర్ హిట్ తెచ్చుకుంది. తాజాగా చెర్రీతోనూ రెండోసారి కలిసి నటించే అవకాశాన్ని కైవసం చేసుకున్నట్లు టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad Realtor: అప్పులు చేసి అపార్ట్‌మెంట్ నిర్మాణం, ఫ్లాట్స్ అమ్ముడవక ఆత్మహత్య

గుజరాత్- మహిళ బట్టలు విప్పి, దాడి చేసి, మోటార్ సైకిల్ చక్రానికి కట్టి ఈడ్చుకెళ్లారు..

ఫిబ్రవరి 2న జనంలోకి జనసేన.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారం

రాత్రికి రాత్రే అంతా మారిపోదు.. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్.. చంద్రబాబు

హైదరాబాద్‌లో రక్తదాన శిబిరాలను నిర్వహించిన కిస్నా డైమండ్ జ్యువెలరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments