Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' ఫంక్షన్‌కి చిరు వెళ్లడంపై రామ్ చరణ్ ఏమన్నాడంటే?

Advertiesment
మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' ఫంక్షన్‌కి చిరు వెళ్లడంపై రామ్ చరణ్ ఏమన్నాడంటే?
, మంగళవారం, 7 జనవరి 2020 (19:20 IST)
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే భారీ మల్టి స్టారర్ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమాలతో పాటు అక్కడక్కడ మధ్యలో కొన్ని ఈవెంట్స్‌కి హాజరవుతూ ఫ్యాన్స్‌ని ఖుషి చేసే రామ్ చరణ్, విజయవాడ విచ్చేసారు. తాను ప్రచార కర్తగా వ్యవహరిస్తున్న హ్యాపీ మొబైల్స్ వారు విజయవాడలోని బందర్ రోడ్‌లో రామ్ చరణ్ చేతుల మీదుగా హ్యాపీ మొబైల్స్ నూతన షోరూమ్ లాంచ్  చేసారు.
 
ఈ సంస్థతో తనకు చాలా కాలం నుండి మంచి అనుబంధం ఉందని, తప్పకుండా విజయవాడలో లాంచ్ అయిన హ్యాపీ మొబైల్స్ నూతన షోరూమ్ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఇక ఫ్యాన్స్ అంటే తమకు ప్రాణమని, ఇక్కడ ఇంతమందిని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని, అయితే మీరు అందరూ మాత్రం జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, మీకోసం ఇంట్లోవారు ఎన్నో ఆశాలతో ఎదురుచూస్తుంటారు, దయచేసి ఎవరూ కూడా కారు స్పీడ్‌గా డ్రైవ్ చేయకండి అని అభిమానులను ఉద్దేశించి రామ్ చరణ్ వ్యాఖ్యానించారు.
 
అయితే... మా వివాదం గురించి అక్కడ మీడియా అడిగితే... మూవీ ఆర్టిస్టుల అసోషియేషన్‌లో విభేదాలు వస్తే.. చూసుకోవడానికి పెద్దలు ఉన్నారన్నారు. మల్టీస్టారర్ సినిమాలు చేయడం గురించి అడిగితే... ఎవరితో అయినా మల్టీస్టారర్ చేయడానికి రెడీ అన్నాడు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుందని చెప్పారు. మహేష్ ఫంక్షన్‌కి చిరంజీవి వెళ్లడంపై స్పందిస్తూ... మహేష్‌కి నాన్న అంటే చాలా గౌరవం. చాలా సార్లు చెప్పాడు. ఒక హీరో ఫంక్షన్‌కి మరో హీరో వెళ్లడం అనేది మంచి పరిణామం అన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏవో ఫోర్‌లు, సిక్స్‌లు కొట్టుకుని గెలిచారంతే