Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవిని రష్మిక మందన్నా కాంట్రాక్టుకు తీసుకుందా?

Advertiesment
చిరంజీవిని రష్మిక మందన్నా కాంట్రాక్టుకు తీసుకుందా?
, సోమవారం, 6 జనవరి 2020 (11:42 IST)
ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం "సరిలేరు నీకెవ్వరు". అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ కాగా, సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో నటించింది. ఈ చిత్రం ప్రిరిలీజ్ వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్ నగరంలో జరిగింది. 
 
ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర హీరోయిన్ రష్మిక గురించి మాట్లాడుతూ, ఈ స్వీట్ లేడీ తనను కాంట్రాక్టుకు తీసుకున్నట్టుగా ఉందన్నారు. తాను ఎక్కడకు వెళ్లినా అక్కడ ఈమె కనిపిస్తోందన్నారు. "ఛలో" చిత్ర ఈవెంట్‌కు వెళితే అక్కడ రష్మిక తొలిసారి కనిపించింది. ఆ తర్వాత తమ బ్యానర్‌లో నిర్మితమైన 'గీతగోవిందం' చిత్రం కోసం వెళితే అక్కడా రష్మికే కనిపించిందని అన్నారు. ఇప్పుడు "సరిలేరు నీకెవ్వరు" కోసం వస్తే ఇక్కడా రష్మికనే. ఇలా, రష్మిక తనను కాంట్రాక్టుకు తీసుకున్నట్టుగా ఉందని చమత్కరించి, నవ్వులు పూయించారు. 
 
ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గురించి మాట్లాడుతూ, దక్షిణాదిలో అంతటి సీనియర్ నటుడు మరెవ్వరూ లేరని, అంతకంటే పెద్ద నటుడు మరొకరు ఉన్నారని తాను అనుకోవడంలేదన్నారు. అయితే కృష్ణగారికి దక్కాల్సిన గౌరవం దక్కలేదేమోనని విచారం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ఆయనకు వచ్చేలాగా చిత్తశుద్ధితో కృషి చేయాలని డిమాండ్ చేశారు. 
 
ఇప్పటికే 350కి పైగా సినిమాల్లో నటించి, మరికొన్ని చిత్రాలు నిర్మించి, కొత్తదనం కోసం ముందుండే సాహసోపేతమైన వ్యక్తి అని, ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అన్ని విధాలా సరైనదని అభిప్రాయపడ్డారు. మహేశ్ బాబు తనకు పేరు తెచ్చేలా ఎదుగుతుండడం కృష్ణగారు ఎంతో గర్విస్తుంటారని తెలిపారు. అలాలగే, 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం కోసం తాను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, రిలీజ్‌కు ఒకరోజు ముందే తనకు ప్రీమియర్ వేస్తున్నారని చిరంజీవి వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రష్మిక ఎంతో స్వీట్‌గా ఉంటుంది... మహేశ్ బాబు