Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియర్ ఎన్టీఆర్ కంగ్రాట్స్.. ప్రోమోల జోష్.. మహేష్ మొగుడైతే.. బన్నీ రంకు మొగుడట!

Webdunia
సోమవారం, 13 జనవరి 2020 (16:08 IST)
సంక్రాంతిని పురస్కరించుకుని సూపర్ స్టార్ రజినీకాంత్ 'దర్బార్', మహేశ్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాలు హిట్ టాక్ సొంతం చేసుకొని వసూళ్ల మోత మోగిస్తున్నాయి. ఇక తాజాగా ఆదివారం విడుదలైన అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' మూవీకి కూడా మంచి టాక్ వస్తోంది.

ఈ నేపథ్యంలో హీరో అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ సైతం ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్‌కు అభినందనలు తెలిపారు. 'కంగ్రాట్స్ బావా'.. అంటూ ట్వీట్ చేశారు. దానికి అల్లు అర్జున్ కూడా.. 'బావా థ్యాంక్స్' అంటూ రిప్లై ఇచ్చారు. 
 
ఇకపోతే.. శనివారం ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు మంచి టాక్ రావడంతో ‘బ్లాక్ బస్టర్ కా బాప్’ పేరుతో ఒక ప్రోమోను విడుదల చేశారు. ''అయ్యబాబోయ్ ప్రసాద్ గారు.. బ్లాక్ బస్టర్ రివ్యూ ఇచ్చేశాడు. ఒక 3, 3.5 దాకా ఇచ్చేశాడండి'' అంటూ మహేష్ బాబు చెప్పే డైలాగ్ ఈ ప్రోమోలో ఆసక్తికరంగా మారింది.

అయితే, ఇప్పుడు ''అల వైకుంఠపురములో'' సినిమాకు కూడా హిట్ టాక్ రావడంతో ఆ ప్రోమోను సైతం విడుదల చేశారు. ''అల వైకుంఠపురములో సంక్రాంతి విన్నర్'' పేరుతో విడుదల చేసిన ఈ ప్రోమో చివరిలో వచ్చే డైలాగ్ ఆసక్తికరంగా మారింది. వాళ్లకి కరెక్ట్ మొగుడిని నేను తగిలిస్తా కదా.. అనే డైలాగ్‌తో ఈ టీజర్‌ను వదిలారు.
 
స్టైలిష్ స్టార్ స్టైలిష్ ఫైట్‌తో ఈ ప్రోమోను కట్ చేశారు. అయితే, ప్రోమో చివరిలో ''బాబోయ్.. ఈడు ఉత్త మొగుడు కాదు, రంకు మొగుడు'' అని సునీల్ చెప్పే డైలాగ్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది.

ఎందుకంటే, ''సరిలేరు నీకెవ్వరు'' సినిమా ట్రైలర్‌లో మహేష్‌ బాబును సంక్రాంతి మొగుడుగా అభివర్ణించారు. ప్రకాష్ రాజ్ చెప్పే ఈ డైలాగ్ బాగా పాపులర్ అయిపోయింది. అందుకేనేమో.. ఇప్పుడు బన్నీని మొగుడు కన్నా ఇంకా పైస్థాయిలో చూపించాలని రంకు మొగుడిని చేసేశారని సినీ పండితులు అంటున్నారు. మొత్తానికి పెద్ద హీరోల సంక్రాంతి సినిమాల జోష్ మామూలుగా లేదు మరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments