Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే వుంది.. పంచ్ డైలాగులతో అల వైకుంఠపురములో..

Advertiesment
Ala Vaikunthapurramuloo Theatrical Trailer
, మంగళవారం, 7 జనవరి 2020 (10:56 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం అల వైకుంఠపురములో. జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. పూజా హెగ్డే హీరోయిన్ కాగా, కె.రాధాకృష్ణ, అల్లు అరవింద్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుకను సోమవారం రాత్రి హైదరాబాద్ నగరంలో జరిగింది. ఈ సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం పంచ్ డైలాగులతో ఆలరిస్తోంది. 
 
'నిజం చెప్పేప్పుడే భయమేస్తుంది నాన్న.. చెప్పకపోతే ఎప్పుడూ భయమేస్తుంది', 'దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది సార్. ఒకటి నేలకి, రెండు వాళ్లకి. అలాంటోళ్లతో మనకి గొడవేంటి సార్. జస్ట్ సరెండర్ అయిపోవాలంతే' వంటి డైలాగులు ఉన్నాయి. 
 
పైగా, ఈ ట్రైలర్ ప్రతి ఒక్క ప్రేక్షకుడుని ఆకట్టుకునేలా ఉంది. జులాయి, స‌న్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కి మంచి విజ‌యం సాధించ‌గా, ఇప్పుడు అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో హ్యాట్రిక్ కొట్ట‌డం ఖాయమని చిత్ర యూనిట్ గట్టి నమ్మకంతో ఉంది. ఈ చిత్రంలో హీరోలు సుశాంత్‌, న‌వ‌దీప్, సునీల్, రాజేంద్రప్రసాద్‌లు నటించగా, సీనియర్ నటి టబు అత్యంత కీలక పాత్రలో పోషించింది. ఎస్ఎస్ థమన్ అద్భుతమైన సంగీత బాణీలను సమకూర్చారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డాడీ డబ్బులు కొట్టేసేవారు కాదు... పక్కా జెంటిల్మెన్.. పద్మశ్రీ ఇవ్వాలి : అల్లు అర్జున్