బాలీవుడ్‌లో మోస్ట్ రొమాంటిక్ కపుల్స్‌లో ఒకరైన దీపిక పదుకోనె, రణ్‌వీర్ సింగ్‌లకు సంబంధించిన ఏ వార్త అయినా సరే వారి ఫ్యాన్స్‌కు పండుగే. సినిమా అప్‌డేట్‌లతో పాటుగా వారి వ్యక్తిగత జీవితాల గురించి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారు.
తాజా ఈ జంట తమ బెడ్రూం విశేషాలను ఓ టీవీ షోలో పంచుకుంది. అంటే వారంతట వారుగా ఈ విషయాలను బయటపెట్టలేదనుకోండి. కార్తిక్ ఆర్యన్ అడిగిన ప్రశ్నకు దీపిక జంట ఈ విధంగా సమాధానమిచ్చారు.
ఇంతకీ ఆ ప్రశ్నేంటంటే...‘ మీరు ప్రతిరోజూ ఉదయం ఏ సైడ్ నుంచి మంచం దిగుతారు’ అని అడుగగా మొదట దీపిక సిగ్గుపడినా చివరకు సమాధానం చెప్పక తప్పలేదు. ‘ప్రతిరోజూ లేచేటప్పుడు కుడి వైపు నుంచి మంచం దిగుతాను’ అని చెప్పింది.
పక్కనే ఉన్న భర్త రణ్‌వీర్ సింగ్ టక్కున మైక్ అందుకుని.. ‘అవును దీపిక ఎప్పుడూ కుడివైపు నుంచే మంచం దిగుతుంది. ఎందుకంటే ఎడమ వైపు నుంచైతే నేను అంత త్వరగా మంచం దిగనివ్వనుగా..’ అంటూ రొమాంటిక్ ఆన్సర్ ఇచ్చారు. దీంతో మరింత సిగ్గుపడిన దీపిక రణ్‌వీర్‌ను మరేమీ మాట్లాడనివ్వకుండా టాపిక్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేసింది.