Webdunia - Bharat's app for daily news and videos

Install App

`ఆడవాళ్లు మీకు జోహార్లు`లో ఖుష్బూ, రాధికా శ‌ర‌త్ కుమార్‌, ఊర్వ‌శి

Webdunia
మంగళవారం, 3 ఆగస్టు 2021 (14:30 IST)
Khushboo, Radhika, Urvashi
శ‌ర్వానంద్, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టిస్తోన్న చిత్రం `ఆడవాళ్లు మీకు జోహార్లు`. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ తిరుమ‌ల కిషోర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల టైటిల్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసిన‌ప్పుడు ట్రెమెండెస్ రెస్పాన్స్ వ‌చ్చింది. మ‌హిళల‌ గొప్ప‌త‌నాన్ని తెలియ‌జేసేలా ఉన్న ఈ టైటిల్‌ను చూసి ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి టైటిల్ బావుందంటూ ప్ర‌శంస‌లు ద‌క్కాయి. 
 
ఈ చిత్రంలో ఎవ‌ర్ గ్రీన్ ఆర్టిస్టులు ఖుష్బూ, రాధికా శ‌ర‌త్‌కుమార్‌, ఊర్వ‌శి భాగ‌మ‌య్యార‌ని లేటెస్ట్‌గా నిర్మాత‌లు తెలియ‌జేశారు. 
 
- సినిమాలో ముగ్గురు మ‌హిళ‌ల పాత్ర ఎంతో కీల‌కంగా ఉండ‌టంతో ఆ పాత్ర‌ల‌ను చేయ‌డానికి చాలా అనుభ‌వం, టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు అవ‌స‌రం కావ‌డంతో మేక‌ర్స్..ఖుష్బూ, రాధికా శ‌ర‌త్‌కుమార్‌, ఊర్వ‌శిల‌ను ఆ పాత్ర‌ల‌కు ఎంపిక చేసుకున్నారు. ఈ ముగ్గురు హీరోయిన్స్ పాత్ర‌ల‌ను ఈ ప్ర‌త్యేక‌మైన సినిమాలో ప్ర‌త్యేకంగా మ‌లిచారు డైరెక్ట‌ర్ తిరుమ‌ల కిషోర్‌. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న షూటింగ్‌లో వీరు ముగ్గ‌రు జాయిన్ అయ్యారు. 
 
ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ సంగీతాన్ని అదిస్తున్నారు. సుజిత్ సారంగ్ సినిమాటోగ్ర‌ఫీ చేస్తున్న ఈ చిత్రానికి ఎడిట‌ర్‌గా నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్‌ శ్రీక‌ర్ ప్ర‌సాద్ ప‌నిచేస్తున్నారు. 
 
న‌టీన‌టులు:
శ‌ర్వానంద్‌, ర‌ష్మిక మంద‌న్న‌, ఖుష్బూ, రాధికా శ‌ర‌త్ కుమార్‌, ఊర్వ‌శి, వెన్నెల కిషోర్‌, ర‌వి శంక‌ర్‌, స‌త్య‌, ప్ర‌దీప్ రావ‌త్‌, గోప‌రాజు, బెన‌ర్జీ, క‌ళ్యాణి న‌ట‌రాజ‌న్‌, రాజ‌శ్రీనాయ‌ర్‌, ఝాన్సీ, ర‌జిత‌, స‌త్య‌కృష్ణ‌, ఆర్‌సీఎం రాజు త‌దిత‌రులు
 
సాంకేతిక వ‌ర్గం: ద‌ర్శ‌క‌త్వం:  తిరుమ‌ల కిషోర్‌, నిర్మాత‌:  సుధాక‌ర్ చెరుకూరి, సినిమాటోగ్ర‌ఫీ:  సుజిత్ సారంగ్‌, ఎడిట‌ర్‌:  శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్‌:  ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీలోని భవనంపై టెర్రస్ నుంచి నవజాత శిశువు మృతదేహం.. ఎలా వచ్చింది?

మాదాపూర్ బార్ అండ్ రెస్టారెంట్‌‌లో అగ్నిప్రమాదం... (video)

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments