Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

‘ఆహా’లో ‘పొగ‌రు’, ‘30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా?

‘ఆహా’లో ‘పొగ‌రు’, ‘30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా?
, మంగళవారం, 29 జూన్ 2021 (19:05 IST)
pogaru- 30 rojulllo..
తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’లో తెలుగు ప్రేక్ష‌కుల కోసం ఈ వారాంతంలో డ‌బుల్ ట్రీట్ అందించ‌డానికి సిద్ధ‌మైంది. హై ఓల్టేజ్ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘పొగ‌రు’, పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో రూపొందిన ప్రేమ క‌థా చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా?’ చిత్రాలు జూలై 2న ‘ఆహా’లో ప్రసారమ‌వుతున్నాయి. ధృవ్ స‌ర్జా, గీతా గోవిందం ఫేమ్ ర‌ష్మిక మంద‌న్న జంటగా..ప‌విత్రా లోకేశ్, ధ‌నంజ‌య‌, ర‌వి శంక‌ర్ ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టించిన ‘పొగ‌రు’ చిత్రాన్ని నంద కిశోర్ తెర‌కెక్కించారు. ధూళిపూడి ఫ‌ణి ప్ర‌దీప్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ‘30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా?’ చిత్రం ద్వారా ప్ర‌ముఖ యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు హీరోగా న‌టించ‌గా, అమృతా అయ్య‌ర్ హీరోయిన్‌గా న‌టించింది. 
 
‘పొగ‌రు’ సినిమా విష‌యానికి వ‌స్తే చ‌ట్టాన్ని లెక్క చేయ‌ని శివ అనే యువ‌కుడు చుట్టూ తిరిగే క‌థ‌. చిన్న‌ప్పుడు తండ్రిని కోల్పోయిన శివ త‌ల్లి ప్రేమ కోసం తాప‌త్ర‌య‌ప‌డుతుంటాడు. బ‌య‌ట‌కు చూడ‌టానికి క‌ఠినంగా ఉంటూ కొన్ని క‌ఠిన ప‌రిస్థితుల్లో జీవిస్తున్న శివ మ‌న‌సు మాత్రం బంగారం. అత‌ని సోద‌రి జీవితంలో జ‌రిగిన ఓ ఘ‌ట‌న కార‌ణంగా అవ‌స‌రంలోని వ్య‌క్తుల‌కు మెస‌య్య‌లా వ్య‌వ‌హ‌రిస్తుంటాడు. ఈ క్ర‌మంలో శివ త‌న జీవితంలో ఎలాంటి స‌వాళ్ల‌ను ఎదుర్కొంటాడు? అనేదే క‌థ‌. ధృవ్ స‌ర్జా మాసీ క్యారెక్ట‌ర్‌లో అద్భుతంగా న‌టించాడు. ర‌ష్మిక త‌న‌దైన పెర్ఫామెన్స్‌తో ఆక‌ట్టుకుంది. డిఫ‌రెంట్‌, యాక్ష‌న్ చిత్రాల‌ను ఇష్ట‌ప‌డేవారికి ‘పొగ‌రు’ త‌ప్ప‌కుండా కిక్‌నిస్తుంది. 
 
‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అర్జున్‌, ఆకర్ష అనే ఇద్ద‌రు కాలేజ్ స్టూడెంట్స్‌కి చుట్టూ తిరిగే క‌థ‌. ప్ర‌థ‌మార్థంలో ఒక‌రంటే ఒక‌రికి ద్వేష‌ముంటుంది. అనుకోని ప‌రిస్థితుల్లో వీరిద్ద‌రికీ వారి గ‌త జీవితం గురించి తెలుస్తుంది. అయితే అక్క‌డే క‌థ‌లో అనుకోని ట్విస్ట్ వ‌స్తుంది. అనూప్ రూబెన్స్ సంగీతం, దాశ‌ర‌థి శివేంద్ర సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు మ‌రింత బ‌లాన్ని అందించాయి. 
 
‘పొగ‌రు, 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా?’ చిత్రాల‌తో పాటు ‘క్రాక్‌, నాంది, జాంబి రెడ్డి, లెవ‌న్త్ అవ‌ర్‌, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్‌, చావు క‌బురు చ‌ల్ల‌గా, జీవి, ఎల్‌.కె.జి’ వంటి తెలుగు బెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను, వెబ్ సిరీస్‌ల‌ను ఆహాలో వీక్షించండి. సినీ ఔత్సాహికులు ఆహాలో ఎంట‌ర్‌టైనింగ్‌ను ఎంజాయ్ చేయండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్-5 కంటెస్టెంట్లు వీరే... మహిళలే ఎక్కువగా...