Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ షూటింగ్ ప్రారంభం

Advertiesment
Ladies you have Johars
, మంగళవారం, 20 జులై 2021 (15:32 IST)
Aadavallu opening
హీరో శర్వానంద్ ప్ర‌స్తుతం మూడు సినిమాలతో ఫుల్‌బిజీగా ఉన్నారు. శర్వానంద్‌ నటించిన ‘ఒకే ఒక జీవితం’ విడుదలకు సిద్ధమ‌వుతుండగా, ‘మహాసముద్రం’, సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో తన పూర్తి ఫోకస్‌ను తన లేటెస్ట్‌ మూవీ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమాపై పెట్టారు శర్వానంద్‌. ఈ మూడు వేటికవే భిన్న‌మైన క‌థ‌లు కావడం విశేషం.
 
టాలీవుడ్‌లో ప్రస్తుతం అగ్ర కథానాయకల్లో ఒకరిగా ఉన్న రష్మిక మందన్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. కిశోర్‌ తిరుమల ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై కథల పట్ల మంచి అభిరుచి, ఎంపికలో మంచి నేర్పు ఉన్న ప్రొడ్యూసర్‌ సుధాకర్‌ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ఈ రోజు నుండి మొదలైంది. ఈ సంద‌ర్భంగా విడుద‌ల‌చేసిన పోస్ట‌ర్‌లో శ‌ర్వానంద్‌, ర‌ష్మిక మంద‌న్న స‌హా సినిమాటోగ్రాఫ‌ర్ సుజిత్ సారంగ్‌ను మ‌నం చూడొచ్చు. ప్ర‌స్తుతం శ‌ర్వానంద్‌, ర‌ష్మిక‌ల‌పై కొన్ని కీల‌క‌స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నాడు ద‌ర్శ‌కుడు కిశోర్ తిరుమ‌ల‌.
 
సినిమా టైటిల్‌ని బట్టి ఈ చిత్రంలోని ఫీమేల్‌ క్యారెక్టర్స్‌ మంచి ఇంపార్టెన్స్‌ ఉంటుందని తెలుస్తుంది. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాలో నటిస్తున్నారు. జాతీయ అవార్డులు సాధించిన శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడింటింగ్‌ బాధ్యతలు నిర్వ‌హిస్తున్న‌ ఈ సినిమాకు సుజిత్‌ సారంగ్‌ సినిమాటోగ్రాఫర్.
నటీనటులు: శర్వానంద్, రష్మికా మందన్నా, ‘వెన్నెల’ కిశోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్‌ రావత్, గోపరాజు, బెనర్జీ, కల్యాణీ, నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్యకృష్ణ, ఆర్‌సీఎమ్‌ రాజు తదితరులు ఎంపిక‌య్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధియేట‌ర్ల‌లోనే సంపూర్ణేష్ బాబు - బ‌జార్ రౌడి