Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు ప్రేమ పుడితే.. అమ్మానాన్నలకు ధైర్యంగా చెప్పేస్తా: కీర్తి సురేష్

అలనాటి నటి సావిత్రి బయోపిక్‌ మహానటిలో అచ్చం సావిత్రిలా ఒదిగిపోయిన నటి కీర్తి సురేష్.. ప్రస్తుతం ఖుషీ ఖుషీగా వుంది. మహానటి హిట్ కావడంతో ఆ సినిమా కలెక్షన్ల వర్షం కురపిస్తున్న తరుణంలో కీర్తి సురేష్ ఆనందం

Webdunia
సోమవారం, 21 మే 2018 (11:00 IST)
అలనాటి నటి సావిత్రి బయోపిక్‌ మహానటిలో అచ్చం సావిత్రిలా ఒదిగిపోయిన నటి కీర్తి సురేష్.. ప్రస్తుతం ఖుషీ ఖుషీగా వుంది. మహానటి హిట్ కావడంతో ఆ సినిమా కలెక్షన్ల వర్షం కురపిస్తున్న తరుణంలో కీర్తి సురేష్ ఆనందంలో మునిగి తేలుతోంది.  సినీ తారల మరో ముఖం ప్రజలకు తెలియదు. అలాంటిది మహానటి చిత్రం ద్వారా సావిత్రి గారి జీవిత చరిత్రను ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు. 
 
మహానటిలో తాను నటించిన తరువాత చాలా విషయాలను తెలుసుకున్నాను. దాంతో పాటు సావిత్రి నిజజీవితంలో ఎలా ఉటుందన్న నిజాన్ని మహానటి సినిమాద్వారా తెలిసిందని కీర్తి సురేష్ తెలిపింది. 
 
ఇక ప్రేమపెళ్లి విషయమై స్పందించిన కీర్తి తాను ఇప్పుడిప్పుడే నటిగా ఎదుగుతున్నాను. కాబట్టి పెళ్లి గురించి ఆలోచించడంలేదు. ఇంకా చెప్పాలంటే మా అమ్మానాన్నలది ప్రేమ వివాహమే. భవిష్యత్‌లో తనకు ఎవరిపైన అయినా ప్రేమపుడితే ఆ విషయాన్ని అమ్మానాన్నలకు ధైర్యంగా చెబుతాను. వారు అంగీకరిస్తేనే ప్రేమ వివాహం చేసుకుంటానని కీర్తి చెప్పుకొచ్చింది. 
 
జీవితంలో జరిగిన విధంగానే సినిమాల నిర్మాణం, దర్శకత్వ పగ్గాలు చేపడతారా? అనే ప్రశ్నకు కీర్తి సురేష్ స్పందించింది. తన తల్లి మేనక, బామ్మ సరోజ నటీమణులని గుర్తు చేస్తూ, సిస్టర్ పార్వతి సైతం సినిమా రంగంలోనే ఉందని, నాన్న నిర్మాతని చెప్పింది. తాను మాత్రం నిర్మాతగా మారబోనని, ఇక దర్శకత్వం చేసేందుకు అర్హత, ప్రతిభ తనకు ఉన్నాయని భావించడం లేదని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

పూజ చేస్తున్న సమయంలో మంటలు.. గాయపడిన గిరిజా వ్యాస్

డామిట్ కథ అడ్డం తిరిగింది... కోడలిని మొదటి భర్త వద్దకు పంపిన అత్తగారు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments