Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'మహానటి' థియేటర్లో నటి హరితేజకు అవమానం... మీరు ఎవరిపక్కనైనా కూర్చుంటారంటూ...

మహానటి చిత్రం చూసేందుకు థియేటరుకు వెళ్లిన నటి హరితేజకు అవమానం ఎదురైంది. థియేటర్లో ఆమెను అనరాని మాటలు అంటూ ఇద్దరు మహిళలు మాట్లాడినట్లు ఆమె సెల్ఫీలో చెపుతూ కన్నీటిపర్యంతమయ్యారు. ఆమె మాటల్లోనే... '' నేను సినిమాల్లోకి వచ్చేందుకు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న

Advertiesment
'మహానటి' థియేటర్లో నటి హరితేజకు అవమానం... మీరు ఎవరిపక్కనైనా కూర్చుంటారంటూ...
, శుక్రవారం, 18 మే 2018 (14:34 IST)
మహానటి చిత్రం చూసేందుకు థియేటరుకు వెళ్లిన నటి హరితేజకు అవమానం ఎదురైంది. థియేటర్లో ఆమెను అనరాని మాటలు అంటూ ఇద్దరు మహిళలు మాట్లాడినట్లు ఆమె సెల్ఫీలో చెపుతూ కన్నీటిపర్యంతమయ్యారు. ఆమె మాటల్లోనే... '' నేను సినిమాల్లోకి వచ్చేందుకు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను. అందరిలానే. కష్టపడి డ్యాన్స్ నేర్చుకున్నాను. ముందుగా బుల్లితెరపై నిరూపించుకుని సినిమాల్లోకి అడుగుపెట్టాను. సినిమావాళ్లు, సినిమా అమ్మాయి అని కొందరు హేళనగా మాట్లాడుతుంటే ఉద్వేగం తన్నుకువస్తుంది. 
 
నాక్కూడా అందరిలానే తల్లి, చెల్లి, తండ్రి, భర్త, అందరూ వున్నారు. రూ. 100 టిక్కెట్ కొని థియేటర్‌కు వస్తే సినిమా నటీనటులను ఏమయినా అనేయవచ్చునని అనుకోవడం చూసి బాధపడుతుంటాను. ఇక అసలు విషయానికి వస్తే... మహానటి చిత్రం చూడాలని, అమ్మా నాన్న అంతాకలిసి వెళ్లాం. అమ్మ తన ప్రక్కన కూర్చోవాలని పిలవడంతో నేను నాన్న వద్ద నుంచి లేచి కూర్చున్నాను. ఇంతలో అటువైపు వున్న తల్లీకూతుళ్లు నాతో వాదనకు దిగారు. మీ నాన్న పక్కన కూర్చోవడానికి మాకిష్టంలేదు. 
 
మీరైతే సినిమా వాళ్లమ్మా... ఎవరి పక్కనైనా కూర్చుంటారు. మాకా దరిద్రం పట్టలేదు అన్నారు. ఆ మాటలకు నాకు ఏడుపు తన్నుకొచ్చింది. వాళ్ల మీద అరిచాను, ఏడ్చాను. మగాళ్ల పక్కన కూర్చోరట. అనరాని మాటలు అన్నారు. నేనిలా సెల్ఫీ వీడియోలో ఈ విషయాలు మాట్లాడితే రివల్యూషన్ వస్తుందని అనుకోవడంలేదు. ఐతే సినిమా అనేది అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సినిమాలో వున్న ఆడపిల్లలు వేరే... బయటవున్న ఆడపిల్లలు వేరే అంటూ మాట్లాడవద్దు. అమ్మాయిలు ఇతర పరిశ్రమల్లో ఎలా పనిచేస్తున్నారో సినిమా పరిశ్రమలోనూ అలాగే పనిచేస్తున్నారు. దయచేసి అలాంటి మాటలు అనవద్దు. ఇలా చెప్పిన తర్వాత కూడా రకరకాలుగా మాట్లాడితే నేనేం చెప్పలేను." అని ఆవేదన వ్యక్తం చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీదేవిది హత్యే.. బాత్‌టబ్‌లో అలా చేసి సాక్ష్యం లేకుండా?: వేదభూషణ్