సావిత్రి పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టిన జమున..!
మహానటి సావిత్రి అయితే... ఆ తర్వాత స్థానం జమునదే. ఇద్దరు మంచి స్నేహితులు. అక్కా, చెల్లి అని పిలుచుకునేంత ఆత్మీయత ఉంది. అలాంటి జమున తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో... సావిత్రి గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. వివాహం విషయంలో సావిత్రి
మహానటి సావిత్రి అయితే... ఆ తర్వాత స్థానం జమునదే. ఇద్దరు మంచి స్నేహితులు. అక్కా, చెల్లి అని పిలుచుకునేంత ఆత్మీయత ఉంది. అలాంటి జమున తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో... సావిత్రి గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. వివాహం విషయంలో సావిత్రి తొందరపాటు నిర్ణయం తీసుకోవడం గురించి తెలిసి నాగేశ్వరరావు ఆమెను వారించారట. అయినా... ఆమె వినిపించుకోలేదు. సావిత్రికి ఆ సమయంలో అవసరమయ్యే తండ్రి గైడన్స్ లేదు.
అందుచేత తనకి ఎలా అనిపిస్తే అలా నిర్ణయాలు తీసుకునే స్థితికి వచ్చేసింది. అదే సమయంలో జెమినీ గణేషన్‌తో కలిసి తమిళ సినిమాల్లో చేసింది. అప్పుడు ఇద్దరు దగ్గరయ్యారు. అయితే... సావిత్రి దగ్గర బాగా డబ్బుంది. అందువలన జెమినీ గణేశన్ ఆమెను ట్రాప్ చేశాడేమోనని అనిపిస్తోంది. నాకు సావిత్రితోనే తప్ప ఆయనతో పెద్దగా పరిచయం కూడా ఉండేది కాదు అని చెప్పారు జమున. అయితే... మహానటి సినిమాలో
సావిత్రితో చనువుగా ఉన్న చిన్నప్పటి సుశీల పాత్రను చూపించారు కానీ... ఇండస్ట్రీలో ఏ హీరోయిన్‌తో ఫ్రెండ్లీగా ఉండేవారు చూపించలేదు ఎందుకనో..?