Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీదేవి బ‌యోపిక్ గురించి వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

టాలీవుడ్‌లో ఇప్పుడు బ‌యోపిక్‌ల ట్రెండ్ న‌డుస్తోంది. మ‌హాన‌టి సావిత్రి బ‌యోపిక్ తెర‌కెక్క‌డం.. సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డం తెలిసిందే. మ‌రోవైపు ఎన్టీఆర్ బ‌యోపిక్, వై.ఎస్.ఆర్ బ‌యోపిక్‌లు రెడీ అవుతున్నాయి. ఎ.ఎన్.ఆర్ బ‌యోపిక్‌కి కూడా తీసేందుకు ప్లాన్స్ జ‌రుగ

Advertiesment
శ్రీదేవి బ‌యోపిక్ గురించి వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
, మంగళవారం, 15 మే 2018 (12:33 IST)
టాలీవుడ్‌లో ఇప్పుడు బ‌యోపిక్‌ల ట్రెండ్ న‌డుస్తోంది. మ‌హాన‌టి సావిత్రి బ‌యోపిక్ తెర‌కెక్క‌డం.. సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డం తెలిసిందే. మ‌రోవైపు ఎన్టీఆర్ బ‌యోపిక్, వై.ఎస్.ఆర్ బ‌యోపిక్‌లు రెడీ అవుతున్నాయి. ఎ.ఎన్.ఆర్ బ‌యోపిక్‌కి కూడా తీసేందుకు ప్లాన్స్ జ‌రుగుతున్నాయ‌ని టాక్ వినిపిస్తోంది. ఇదిలాఉంటే... అతిలోక సుంద‌రి శ్రీదేవి బ‌యోపిక్ గురించి గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. 
 
ఇదే విష‌యం గురించి వివాద‌స్ప‌ద‌ ద‌ర్శ‌కుడు వ‌ర్మ‌ని అడిగితే... సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. ఇంత‌కీ వ‌ర్మ ఏమ‌న్నారంటే... శ్రీదేవి బ‌యోపిక్ ఎవ‌రు తెర‌కెక్కించాలి అనుకున్నా... ఆమెలా న‌టించ‌గ‌ల న‌టి లేర‌న్నారు. శ్రీదేవి గారి బయోపిక్ ఎవరు తెరకెక్కించాలి అనుకున్నా ఆమెలా నటించగల నటిని తీసుకురాలేరు. ఒకవేళ ఎవరైనా బయోపిక్ చేద్దామని ముందుకు వచ్చిన బోనీ కపూర్ దాన్ని సరిగా తెరకెక్కనివ్వరు అన్నారు. త‌న‌కు మాత్రం శ్రీదేవి బ‌యోపిక్ తీసే ఆలోచ‌న లేద‌న్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్-2కి కమల్ హాసన్, నాని రెడీ-కంటెస్టెంట్స్‌గా రాయ్ లక్ష్మీ, గీతా మాధురి..?