టాలీవుడ్‌లో బయోపిక్స్ జోరు.. మహానటి తరహాలో సౌందర్య మూవీ?
టాలీవుడ్‌లో బయోపిక్‌లో జోరు కొనసాగుతోంది. మహానటి హిట్ కొట్టడంతో అదే కోవలో బయోపిక్ సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఈ కోవలో తెలుగు సినీ పరిశ్రమలో అందంతో పాటు అభినయంతో ఆకట్టుకున్న హీర
టాలీవుడ్‌లో బయోపిక్‌లో జోరు కొనసాగుతోంది. మహానటి హిట్ కొట్టడంతో అదే కోవలో బయోపిక్ సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఈ కోవలో తెలుగు సినీ పరిశ్రమలో అందంతో పాటు అభినయంతో ఆకట్టుకున్న హీరోయిన్ సౌందర్య బయోపిక్ కూడా రానుంది. అలనాటి సినీతార సావిత్రి బయోపిక్ మహానటి పేరుతో విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే.
అలాగే మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధిత పనులు జరుగుతున్నాయి. అలాగే మహానేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి బయోపిక్ కూడా రూపుదిద్దుకుంటోంది. ఈ నేపథ్యంలో తెలుగు, తమిళ భాషల్లో అగ్రహీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సౌందర్య జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతోంది. నటన పరంగానే అవకాశాలు దక్కించుకున్న సౌందర్య .. నెంబర్ వన్ ప్లేస్‌లో కొనసాగుతూ ఉండగానే హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతిచెందింది.
అలాంటి అందాల రాశి సౌందర్య జీవితచరిత్రను రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది తాజా సమాచారం. ఈ సినిమాకి నిర్మాతగా రాజ్ కందుకూరి వ్యవహరించనున్నాడని టాక్. అలాగే కొత్తగా ఉదయ్ కిరణ్ బయోపిక్‌కు కూడా రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.