''మహానటి''కి కలెక్షన్ల వర్షం.. నైజాంలో దూసుకుపోతోంది.. 9 రోజులకు?

అలనాటి మేటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా ''మహానటి'' సినిమా విడుదలై బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓవర్సీస్‌లో కలెక్షన్లలో దున్నేస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేశ్ ప్రధానమై

శుక్రవారం, 18 మే 2018 (17:16 IST)
అలనాటి మేటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా ''మహానటి'' సినిమా విడుదలై బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓవర్సీస్‌లో కలెక్షన్లలో దున్నేస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రలో ఈ నెల 9వ తేదీన ''మహానటి'' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విశేషమైన ఆదరణ పొందుతోంది. 
 
సావిత్రికి గల క్రేజ్ అందరినీ థియేటర్స్‌కి ప్రేక్షకులను రప్పిస్తోంది. అందుకు దారితీసిన పరిస్థితులను గురించి తెలుసుకోవడానికి మహానటి సినిమాను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగానే ఈ సినిమా ఎంతమాత్రం జోరు తగ్గకుండా దూసుకుపోతోంది. 
 
ముఖ్యంగా నైజామ్‌లో భారీ వసూళ్లు రాబడుతోంది. ఐదు రోజుల్లో రూ.3.47కోట్ల షేర్‌ను వసూలు చేసింది. తొమ్మిది రోజులకు రూ.5.89 కోట్ల షేర్‌ను సాధించింది. కథానాయిక ప్రాధాన్యత గల సినిమాకి ఈ స్థాయిలో వసూళ్లు రావడం విశేషమని సినీ యూనిట్ తెలిపింది. 
 
అలాగే సావిత్రి జీవితంపై తెరకెక్కిన ''మహానటి'' చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. ఇండస్ట్రీ బిగ్ షాట్స్ చిత్ర బృందాన్ని సన్మానాలు, సత్కారాలతో ముంచెత్తుతున్నారు. తాజాగా మంచు ఫ్యామిలీ స్టార్స్ మోహన్ బాబు, మంచు లక్ష్మి, విష్ణు బృందం సన్మానించారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం కొత్త హీరో సెట్లోకి రాగానే లేచి నమస్కారం పెట్టాల్సి వస్తోంది: చంద్రమోహన్