Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీజర్ చూడగానే సినిమా చూడాల‌నిపించిందట చిరంజీవికి. ఇంత‌కీ అది ఏ సినిమా టీజ‌ర్..?

Webdunia
గురువారం, 20 జూన్ 2019 (11:10 IST)
ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి' ది క్రికెటర్‌ అనేది టాగ్‌లైన్‌.


ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌తోనే సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న ఈ చిత్రం టీజర్‌ను జూన్‌ 18న మెగాస్టార్‌ చిరంజీవి రిలీజ్‌ చేశారు. 
 
 
ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడుతూ... ''క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మా కె.ఎస్‌. రామారావు గారి నిర్మాణ సారథ్యంలో మిత్రుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'కౌసల్య కృష్ణమూర్తి'. ఇది క్రికెట్‌ నేపథ్యంలో వస్తోన్న విబిన్న కథాంశమిది. స్పోర్ట్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మూవీస్‌కి ప్రతి ఒక్కరూ కనెక్ట్‌ అవుతారు. నేషనల్‌ వైడ్‌గా స్పోర్ట్స్‌ నేపథ్యంలో తీసిన ప్రతి సినిమా ఘన విజయం సాధించాయి. గేమ్స్‌కి అంతటి ప్రాధాన్యత ఉంది. ఇండియాలో క్రికెట్‌ అనేది ఒకరకంగా చెప్పాలంటే నేషనల్‌ గేమ్ లాంటిది. దాని బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న సినిమా 'కౌసల్య కృష్ణమూర్తి'. 
 
ఇందులో హీరోయిన్‌గా చేసిన ఐశ్యర్యా రాజేష్‌... సాధారణ రైతు బిడ్డగా పుట్టి ఒక ఉమెన్‌ క్రికెటర్‌గా అంతర్జాతీయ స్థాయికి ఎదిగే పాత్రలో ఆ అమ్మాయి చక్కగా ఒదిగిపోయింది.
 
 క్రికెటర్‌ క్యారెక్టర్‌కి జస్టిఫై చేయడానికి నాలుగైదు నెలల పాటు శిక్షణ తీసుకొని ఆ తర్వాత షూటింగ్‌ చేయడం ప్రారంభించింది అంటే ఆ అమ్మాయికి ఉన్న డెడికేషన్‌, శ్రద్ధాసక్తులు, పడిన కష్టం కానీ అంతా ఇంతా కాదు. 
 
ఐశ్వర్యా రాజేష్‌ ఎవరో కాదు.. మా కొలీగ్‌ రాజేష్‌ కూతురు. అలాగే కమెడియన్‌ శ్రీలక్ష్మీ మేనకోడలు. మన తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలు కొరవడిపోతున్న ఈరోజుల్లో ఐశ్వర్యా రాజేష్‌ రావడం అన్నది శుభపరిణామం. నేను ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తూ.. స్వాగతం పలుకుతున్నాను. 
 
ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ఎలాంటి ప్రోత్సాహం లేని వాతావరణం నుండి వచ్చి తనకు తానుగా వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకుంటూ అంతర్జాతీయ స్థాయికి వెళ్లి, ఎన్నో కీర్తి ప్రతిష్టలు సంపాదించి, దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసేవిధంగా క్లైమాక్స్‌ ఉంటుంది అని చెప్పారు. నాకు ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది. 
 
ఖచ్చితంగా ఈ సినిమా విజయవంతం అవుతుందని, మంచి విజయవంతమైన సినిమాలకు పెట్టింది పేరైన క్రియేటివ్‌ కమర్షియల్స్‌కి ఇది మరో విజయం అవుతుంది. అలాగే కమర్షియల్‌తో పాటు మంచి ఇతివృత్తాలను తీసుకునే తెరకెక్కించే భీమనేని శ్రీనివాసరావుకి ఇది ఒక మైలుస్టోన్‌ మూవీగా నిలుస్తుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నా. ప్రతి ఒక్క యూనిట్‌ సభ్యునికి హృదయపూర్వక శుభాకాంక్షలు'' అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

వివాహేతర సంబంధం: పెళ్లయ్యాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వక శృంగారం తప్పు కాదు కానీ...

కేరళ తిరూర్.. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు.. టూవీలర్‌పై జర్నీ చేసిన వారికి?

కస్టోడియల్ టార్చర్ చేసినవారంతా జైలుకు వెళ్లడం ఖాయం : ఆర్ఆర్ఆర్

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు స్థల పరిశీలన : మంత్రి టీజీ భరత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments