తెలుగు చిత్ర పరిశ్రమలో మూవీ మొఘల్‌గా పేరుగాంచిన నిర్మాత డాక్టర్ డి. రామానాయుడు. ఈయన మెగాస్టార్ చిరంజీవితో ఒకే ఒక చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం పేరు సంఘర్షణ. ఆ తర్వాత మరో చిత్రం తీయలేదు.
దీనిపై రామానాయుడు పెద్ద కుమారుడైన నిర్మాత డి. సురేష్ బాబు స్పందించారు. నిజానికి అప్పట్లోనే చిరంజీవి చాలా బిజీగా ఉండేవారన్నారు. పైగా, నాన్నకీ .. చిరంజీవిగారికి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. కానీ మా బ్యానర్‌పై ఒక సినిమా చేయమని అడిగితే, ఆరు నెలలు ఆగండి .. ఏడాది ఆగండి అంటారేమోననే ఒక ఆలోచన.
ఎందుకంటే.. ప్రొడక్షన్ విషయంలో నాన్న గ్యాప్ రాకుండా చూసేవారు. అందువల్ల స్టార్ హీరోల కోసం ఎదురుచూడకుండా ఆయన కథలను ఎక్కువగా నమ్మేవారు. అలా చేసిన సినిమాలు కూడా సక్సెస్ అయ్యాయి. 'ప్రతిధ్వని' .. 'ప్రేమఖైదీ'వంటి సినిమాలు అందుకు నిదర్శనం. అందువల్లే చిరంజీవి వంటి స్టార్ హీరోతో అధిక చిత్రాలు నిర్మించలేక పోయామని చెప్పుకొచ్చారు.