Webdunia - Bharat's app for daily news and videos

Install App

తారక్‌ను నాన్నా అని పిలుస్తా.. తమ్ముడు అని ఎప్పుడూ పిలవను.. కల్యాణ్ రామ్

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (11:51 IST)
జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ సోదర ప్రేమ గురించి అందరికీ తెలిసిందే. తాజాగా జూనియర్ ఎన్టీఆర్‍‌పై కల్యాణ్ రామ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఎంత మంచివాడవురా సినిమా రిలీజ్ సందర్భంగా అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న కల్యాణ్‌రామ్.. తన తమ్ముడి గురించి కొన్ని విషయాలు వెల్లడించాడు. తారక్‌ను నాన్నా అని పిలుస్తానని, తమ్ముడు అని ఎప్పుడూ పిలవనని చెప్పాడు. 
 
తారక్ తనతో కొన్ని సార్లు తండ్రిగా, అన్నగా, తమ్ముడిగా ఉంటాడని, కొన్ని సార్లు చిన్న పిల్లాడిగా మారిపోతాడని వెల్లడించాడు. సాధార‌ణంగా మేం ఏ సినిమాలు చేస్తున్నామో వాటి గురించి చిన్నపాటి డిస్కష‌న్ ఉంటుంది. అలాంటి డిస్కష‌న్‌లో ఎంత మంచి వాడవురా కథ గురించి చెప్పగానే త‌ను హ్యాపీగా ఫీల‌య్యాడని తెలిపాడు. 
 
కాగా, అత‌నొక్కడే నుంచి 118 వ‌ర‌కు వైవిధ్యమైన చిత్రాల‌తో ప్రేక్షకుల‌ను మెప్పించిన నంద‌మూరి క‌థానాయ‌కుడు క‌ళ్యాణ్‌ రామ్ తాజాగా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ఎంత మంచివాడ‌వురాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మించారు.
 
శ్రీదేవి మూవీస్ శివ‌లెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రానికి స‌మ‌ర్పకుడిగా వ్యవ‌హ‌రిస్తున్నారు. శతమానం భవతి చిత్రంతో జాతీయ పురస్కారాన్ని గెలుచుకున్న వేగేశ్న సతీష్‌ ద‌ర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 15న విడుదలైన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

పెళ్లి కాలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

శ్రీవారి అన్నదాన కేంద్రంలో మధ్యాహ్న భోజనానికి రూ.17 లక్షలు వితరణ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments