''ఆర్ఆర్ఆర్'' షూటింగ్ వున్నా పర్లేదు.. బిగ్ బాస్‌కు వస్తా.. టైగర్

శుక్రవారం, 10 జనవరి 2020 (18:52 IST)
ట్రిపుల్ ఆర్ సినిమా షూటింగ్ ఓ వైపు జరుగుతున్నా.. జక్కన్న వద్ద పర్మిషన్ తీసుకుని బిగ్ బాస్ హోస్ట్‌గా వచ్చేస్తాననంటున్నారు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్. అవును ప్రస్తుతం ఫిలిమ్ నగర్ వర్గాల్లో ఇదే టాక్ నడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ నాలుగో సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే తెలుగులో మూడు సీజన్లు ముగిసిన సంగతి తెలిసిందే.
 
తొలి సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించగా, రెండో సీజన్‌కు నాని, మూడో సీజన్‌కు అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరించారు. ప్రస్తుతం రేటింగ్ పరంగా ఆలోచిస్తున్న మా టీవీ బిగ్ బాస్ నాలుగో సీజన్‌కు ఎన్టీఆర్‌నే రంగంలోకి దించాలని భావిస్తోంది. కాగా, బిగ్ బాస్ మూడో సీజన్‌ను నాగ్ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా నడిపించడంతో ఆయన్నే కంటిన్యూ చేస్తారని అందరూ భావించారు. 
 
కానీ తాజా ప్రచారంతో బిగ్ బాస్ కొత్త సీజన్ హోస్ట్ ఎవరన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. బిగ్ బాస్ షో ప్రారంభమయ్యే సమయానికి ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం కూడా పూర్తవుతుంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా ఫిలిమ్ నగర్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. బిగ్ బాస్-4 కోసం నిర్వాహకులు మళ్లీ జూనియర్ ఎన్టీఆర్‌నే సంప్రదించారని, కళ్లుచెదిరే మొత్తాన్ని ఆఫర్ చేశారని టాక్ వినిపిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం రష్మికను ఆటాడుకున్న సితార - ఆద్య (వీడియో)