ఎన్టీఆర్‌ బయోపిక్.. జయలలిత రోల్‌లో నేనా? నోనో: కాజల్ అగర్వాల్

తెలుగువారి ఆరాధ్య నటుడు నందమూరి తారక రామారావు బయోపిక్ ఇటీవల హైదరబాద్‌లో రామకృష్ణ స్టూడియోస్‌లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి తొలి షాట్

Webdunia
సోమవారం, 16 ఏప్రియల్ 2018 (12:16 IST)
తెలుగువారి ఆరాధ్య నటుడు నందమూరి తారక రామారావు బయోపిక్ ఇటీవల హైదరబాద్‌లో రామకృష్ణ స్టూడియోస్‌లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి తొలి షాట్‌కు క్లాప్ కొట్టారు.


దర్శకుడు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం రామకృష్ణ స్టూడియోస్‌లో వేసిన కౌరవ సభ సెట్‌లో తొలి చిత్రీకరణ జరిగింది. కౌరవ సెట్‌లో బాలకృష్ణ ఎన్టీఆర్‌ రోల్‌లో దుర్యోధనుడిగా అలరించారు.  
 
ఈ చిత్రంలో చందమామ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం కాజల్ చేతిలో ''క్వీన్'' రీమేక్ (పారిస్ పారిస్)మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్‌లో జయలలిత పాత్రలో కాజల్ కనిపించబోతుందని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. 
 
ఈ వార్తల్లో నిజం లేదని.. ఎన్టీఆర్ బయోపిక్ కోసం తనను ఎవరూ సంప్రదించలేదని కాజల్ స్పష్టం చేసింది. కాగా ఎన్టీఆర్ బయోపిక్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుండగా.. దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రైన్ ఏసీ బోగీలో ప్లగ్గుకి కెటిల్ పెట్టి మ్యాగీ చేసిన మహిళ (video)

నాంపల్లికి కోర్టులో జగన్మోహన్ రెడ్డి.. వీడియో ఎలా లీకైంది? వైకాపా సీరియస్

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

Debts: అప్పుల బాధ ఆ కుటుంబాన్నే మింగేసింది.. ఎక్కడ.. ఏం జరిగింది..?

50 మంది కళాకారులకు రూ. 60 లక్షల గ్రాంట్‌ను ప్రకటించిన హెచ్‌ఎంఐఎఫ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments