Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్.టి.ఆర్ అంటే సరికొత్త అర్థం చెప్పిన బాలయ్య.. ఏంటది?

స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఈ చిత్రం షూటింగ్ గురువారం ఉదయం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ప్రారంభమైంది.

Advertiesment
ఎన్.టి.ఆర్ అంటే సరికొత్త అర్థం చెప్పిన బాలయ్య.. ఏంటది?
, గురువారం, 29 మార్చి 2018 (13:14 IST)
స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఈ చిత్రం షూటింగ్ గురువారం ఉదయం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ప్రారంభమైంది.
 
ఈ సందర్భంగా హీరో బాలకృష్ణ మాట్లాడుతూ, ఎన్టీఆర్ అంటే నందమూరి తారక రామారావుగా అందరూ అనుకుంటారని, తనకు మాత్రం ఎన్టీఆర్ అన్న మాటే తన హృదయ స్పందనని చెప్పారు. తనకు తండ్రి, గురువు, దైవం ఎన్టీఆరేనని చెప్పారు. ఈ భూమిపై ఎందరో పుడుతూ ఉంటారని, అందరినీ మహానుభావులుగా భావించలేమని, ఆ స్థానానికి తగ్గ వ్యక్తి ఎన్టీఆర్ అంటూ కొనియాడారు. 
 
ఇకపోతే, శంకరాచార్యులు, రామానుజాచార్యులు, గౌతమీపుత్ర శాతకర్ణి, బాబా సాహెబ్ అంబేద్కర్, జాతిపిత మహాత్మాగాంధీ వంటి వారి సరసన నిలిచే అర్హతున్న వ్యక్తి ఎన్టీఆర్ అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. పైగా, 'ఎన్' అంటే నటనాలయం. ఆయన ఇల్లే నటనాలయం. ఆయన నటరాజు నటసింహుడు. 'టి' అంటే తారా మండలంలోని ధ్రువతారకుడు. 'ఆర్' అంటే రాజర్షి, రారాజు, రాజకీయ దురంధరుడు అంటూ ఎన్.టి.ఆర్ అనే మూడు అక్షరాలకు సరికొత్త అర్థం చెప్పారు. 
 
అంతకుముందు ఎన్టీ రామారావు బయోపిక్ ఎన్టీఆర్ ముహూర్తపు షాట్‌గా, ఎన్టీఆర్ కెరీర్‌లోని అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన 'దాన వీర శూర కర్ణ' ముహూర్తపు షాట్‌గా చిత్రీకరించారు. 1976లో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవానికి నాటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.జి. రామచంద్రన్ ప్రత్యేక అతిథిగా వచ్చి క్లాప్ కొట్టగా, ఇపుడు ఎంజీఆర్ వేషం వేసుకున్న నటుడు వచ్చి క్లాప్ కొట్టగా, దుర్యోధనుడి వేషంలో ఉన్న బాలయ్య, తన మీసం మెలేస్తూ, డైలాగ్ చెప్పారు. తొలి షాట్‌కు దర్శకుడు బోయపాటి శీను దర్శకత్వం వహించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ హీరోయిన్‌పై మనసుపడింది.. అడిగినదానికంటే రూ.10 లక్షలు ఎక్కువిస్తా...