Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిల్మ్ నగర్ ఆఫీసులు ఆ ఏరియాలుగా మారిపోయాయి: శ్రీరెడ్డి

తెలుగు సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేస్తున్న శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఒక్క అవకాశం లభిస్తే చాలు.. అని భావించి ఏదైనా చేసే అమ్మాయిలను ఓదార్చే వ్యాఖ్యలు చేసింది. "మ

Webdunia
సోమవారం, 16 ఏప్రియల్ 2018 (10:19 IST)
తెలుగు సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేస్తున్న శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఒక్క అవకాశం లభిస్తే చాలు.. అని భావించి ఏదైనా చేసే అమ్మాయిలను ఓదార్చే వ్యాఖ్యలు చేసింది. "మనసుతో పడుకోని ఏ అమ్మాయి అయినా నా దృష్టిలో మలినం అంటని పవిత్ర" అని పేర్కొంది.


అమ్మాయిలు తప్పనిసరై తమ మనసులు చంపుకుని టాలీవుడ్‌లో జీవించాల్సి వస్తోందని చెప్పింది. నిత్యమూ ఎందరి చేతుల్లోనో నలిగినా కూడా అవకాశాలు లభించేది అంతంతమాత్రమేనని శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. ఇంకా కాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేస్తూ.. ఫిల్మ్ చాంబర్ ముందు చేసిన అర్ధనగ్న ప్రదర్శన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 
 
కాగా తెలుగు సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై శ్రీరెడ్డి రోజుకో లీక్ చేస్తూ సంచలనం సృష్టిస్తోంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో లైంగిక, ఆర్థిక దోపిడి అనే అంశంపై హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన బహిరంగ చర్చలో శ్రీరెడ్డి అలియాస్ శ్రీశక్తి మాట్లాడుతూ., ఫిల్మ్ నగర్‌లోని అన్నీ ఆఫీసులు రెడ్‌లైట్‌ ఏరియాలుగా మారిపోయాయని.. సాయంత్రం ఆరు దాటితే చాలు విచ్చలవిడి అకృత్యాలకు అవి నిలయంగా మారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం