Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి జ్యోతికను పోలీసు ఆఫీసర్‌గా చూస్తుంటే... 'సమ్మోహనం' శ్రీధర్

తమిళంలో విడుదలై భారీ విజయం సాధించిన నాచియార్ చిత్రం తెలుగులో ఝాన్సీ పేరుతో విడుదలకు సిద్ధం అవుతుంది. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించగా స‌న్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ బాల స్వీయ‌ దర్శకత్వంలో నిర్మించబడిన ఈ చిత్రం తెలుగులో కోనేరు కల్పన మరియు డి అభిరాం అజయ్ కుమార్

Webdunia
సోమవారం, 23 జులై 2018 (21:10 IST)
తమిళంలో విడుదలై భారీ విజయం సాధించిన నాచియార్ చిత్రం తెలుగులో ఝాన్సీ పేరుతో విడుదలకు సిద్ధం అవుతుంది. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించగా స‌న్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ బాల స్వీయ‌ దర్శకత్వంలో నిర్మించబడిన ఈ చిత్రం తెలుగులో కోనేరు కల్పన మరియు డి అభిరాం అజయ్ కుమార్ కలిసి కల్పనా చిత్ర మరియు యశ్వంత్ మూవీస్ బ్యానర్స్ ద్వారా సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి తెలుగు టీజర్‌ను సమ్మోహనం చిత్రంతో మంచి విజయం సాధించిన యువ హీరో సుధీర్ బాబు విడుదల చేసారు. 
 
ఆయన టీజర్ చూసి "టీజర్ చాల బాగుంది, జ్యోతిక గారిని పోలీస్ ఆఫీసర్‌గా చూస్తుంటే... వారి శ్రీవారు సూర్య గారు గుర్తుకొస్తున్నారు. పోలీస్ సినిమా అంటేనే సూర్య గుర్తుకు వస్తారు. ఇప్పుడు వారి సతీమణి జ్యోతిక పోలీస్ ఆఫీసర్‌గా సినిమా చేయటం చాల ఆనందంగా ఉంది. తమిళంలో ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులో ఝాన్సీ అనే  పవర్‌ఫుల్ టైటిల్‌తో మన ముందుకు వస్తున్నారు. టీజర్ చూసాక సినిమా ఖచ్చితంగా చూడాలి అని అనిపిస్తుంది. తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాతలు కోనేరు కల్పన మరియు డి అభిరాం అజయ్ కుమార్ గారికి ఆల్ ది బెస్ట్ అని అన్నారు. 
 
జ్యోతిక టెర్రిఫిక్ పర్ఫార్మ్యాన్స్, జివి.ప్ర‌కాష్ అద్భుతమైన నటన మరియు ఇళయరాజా గారి సంగీతం ఈ చిత్రం స‌క్సెస్‌కి ప్ర‌ధార‌ణ కార‌ణం. ఇంత భారీ స‌క్సెస్‌ని అందుకున్న‌ నాచియార్ మూవీ ఇప్పుడు తెలుగులో మ‌రిన్ని సంచ‌ల‌నాలు తెర‌లేప‌టానికి వ‌స్తుంది. తెలుగులోకి వ‌స్తున్న ఈ మూవీకి ఇప్పటికే మార్కెట్ వ‌ర్గాల నుండి పోటా పోటీ బిసినెస్ జరుగుతుంది. త‌మిళ్‌లో మాదిరిగా తెలుగులో కూడా స‌క్స‌స్ సాధిస్తుంద‌ని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వన్ నేషన్-వన్ ఎలక్షన్: దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా

కేటీఆర్‌ను కలవలేదు.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదు.. దువ్వాడ మాధురి (video)

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments