Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'శ్రీనివాస కళ్యాణం' కథ విన్నాక.. పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయా: నితిన్ (వీడియో)

''శ్రీనివాస కళ్యాణం''లో యంగ్ హీరో నితిన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫోటోలు, కాన్సెప్ట్ టీజర్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి నితిన్ మాట్లాడుతూ.. తన కెరీర్ ముగిసిన త

Advertiesment
Srinivasa Kalyanam Audio Launch Live
, సోమవారం, 23 జులై 2018 (14:46 IST)
''శ్రీనివాస కళ్యాణం''లో యంగ్ హీరో నితిన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫోటోలు, కాన్సెప్ట్ టీజర్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి నితిన్ మాట్లాడుతూ.. తన కెరీర్ ముగిసిన తరువాత ది బిస్ట్ మూవీస్‌లో ఒకటిగా ''శ్రీనివాస కళ్యాణం'' ఉంటుందని చెప్పారు.


రాశీ ఖన్నా జోడిగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ''శ్రీనివాస కళ్యాణం'' ఆడియో వేడుక ఆదివారం నాడు హైదరాబాద్‌లో తారల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా సాగింది. 
 
శ్రీనివాస కళ్యాణం పాటల పండుగ కార్యక్రమానికి పెళ్లి గెటప్‌లో వచ్చిన నితిన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సతీష్ వేగ్నేశ డైరెక్ట్ చేసిన ఈ కథ మొదట విన్నప్పుడు తనకు కూడా పెళ్లి చేసుకోవాలనిపించిందని నితిన్ అన్నాడు. తనను పెళ్లి చేసుకోమని ఇంట్లో వారు అడుగుతూనే వున్నారు. అయితే తర్వాత చేసుకుంటాలే అంటూ వాయిదా వేస్తూ వస్తున్నాను. సతీష్ వేగ్నేశ తన వద్దకు వచ్చి కథ చెప్పగానే నిజంగానే పెళ్లి చేసుకోవాలని ఫిక్సయిపోయానని తెలిపారు. 
 
అయితే పెళ్లంటే ఇప్పుడు జరిగే పెళ్లిలా కాదు.. మా సినిమాలో జరిగే పెళ్లిలా చేసుకోవాలని అనుకున్నానని నితిన్ చెప్పారు. షూటింగ్ ఆరంభంలోనే పెళ్లి సన్నివేశాలు షూట్ చేశారు. ఆ పూజలు, వ్రతాలు చూసి బాబోయ్ పెళ్లంటే ఇలా ఉంటుందా అనుకున్నా.. అది విని మా అమ్మ కంగారు పడుతుందేమోనని టెన్షన్ పడకు మమ్మీ పెళ్లి కచ్చితంగా చేసుకుంటానని చెప్పినట్లు నితిన్ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ ఇంట్లో సందడి చేసిన మంచు లక్ష్మక్క...చివరిలో షాకిచ్చి అందరినీ ఏడిపించేసింది