టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన భార్యతో కలిసి భద్రాద్రి సీతారాముల స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం కుటుంబ సమేతంగా భద్రాచలం వచ్చిన తారక్ దంపతులకు దేవస్థానం సిబ్బంది సాదరస్వాగతం పలికారు.
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన భార్యతో కలిసి భద్రాద్రి సీతారాముల స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం కుటుంబ సమేతంగా భద్రాచలం వచ్చిన తారక్ దంపతులకు దేవస్థానం సిబ్బంది సాదరస్వాగతం పలికారు.
అనంతరం తారక్ కుటుంబం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. తర్వాత స్వామి వారి తీర్ధప్రసాదాలను ఆలయసిబ్బంది వారికి అందజేశారు. ఈ సందర్భంగా క్షేత్ర విశిష్టతను ఎన్టీఆర్ అడిగి తెలుసుకున్నారు.
రామాయణంలోని పాత్రలను ఇతివృత్తంగా తీసుకుని ఎన్టీఆర్ నటించిన ‘జై లవ కుళ’ దసరా కానుకగా విడుదలై ఘనవిజయం సాధించిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్‌తో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా సతీసమేతంగా స్వామి వారి సేవలో పాల్గొన్నారు. వీరితో పాటు పలువురు నిర్మాతలు స్వామి వారిని దర్శించుకున్నారు.