Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్టీఆర్ కొత్త సినిమా పేరు చూసి హడలిపోతున్న యువహీరోలు.. ఎందుకు?

జూనియర్ ఎన్‌టిఆర్. ప్రతి సినిమాలోను కొత్త గెటప్‌లో కనిపిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంటున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలన్నీ భారీ కలెక్షన్ల దిశగా దూసుకెళుతుంటే కొంతమంది యువ హీరోలకు అది ఏమాత్రం మింగుడు పడటం లేదు. జూనియర్ బాగా రాటు తేలిపోతున్న

ఎన్టీఆర్ కొత్త సినిమా పేరు చూసి హడలిపోతున్న యువహీరోలు.. ఎందుకు?
, మంగళవారం, 7 నవంబరు 2017 (18:48 IST)
జూనియర్ ఎన్‌టిఆర్. ప్రతి సినిమాలోను కొత్త గెటప్‌లో కనిపిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంటున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలన్నీ భారీ కలెక్షన్ల దిశగా దూసుకెళుతుంటే కొంతమంది యువ హీరోలకు అది ఏమాత్రం మింగుడు పడటం లేదు. జూనియర్ బాగా రాటు తేలిపోతున్నాడే.. ఆయనకు ఇక తిరుగులేదా.. డైనమిక్ దర్శకులతో మంచి పేరు సంపాదించేస్తున్నాడే.. ఇది యువ హీరోల మధ్య జరుగుతున్న చర్చ. 
 
జై లవకుశ సినిమాలో మూడు పాత్రలను పోషించి మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నారు జూనియర్ ఎన్‌టిఆర్. ఆ ఒక్క సినిమానే కాదు. అంతకుముందు నటించిన అన్ని సినిమాల్లోను జూనియర్‌ది అందివేసిన చేయి. అయితే ఇప్పుడంతా జూనియర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌లు తీయనున్న సినిమాపైనే తెలుగు సినీపరిశ్రమలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. హారిక హాసిని ప్రొడక్షన్ బ్యానర్ పైన త్రివిక్రమ్ జూనియర్ ఎన్‌టిఆర్‌తో కలిసి ఒక సినిమాను చేయనున్నారు. ఆ సినిమాపై యంగ్ టైగర్ అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు.
 
పవన్ కళ్యాణ్‌కు మంచి హిట్లు ఇచ్చిన త్రివిక్రమ్ మొదటిసారి జూనియర్‌తో సినిమా చేయడం ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. మొదటగా వీరి సినిమాకు సోల్జర్, రాముడు-భీముడు అనే టైటిళ్లను అనుకున్నారట. ఈ పేరుతో భారీగానే ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. కానీ ఆ తరువాత సినిమా నిర్మిస్తున్న సంస్థ మాత్రం ఆన్ సైలెంట్ మోడ్.. అనే పేరుతో సినిమాను రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఇలాంటి పేరుతో ఎప్పుడూ సినిమాలు రాలేదు. అందులోను నిశ్శబ్దంగా ఉండటమనేది టైటిల్. దీనిపైనే భారీ అంచనాలు ఉండగా యువ హీరోలు మాత్రం వీటిని తలుచుకుని తెగ బాధపడిపోతున్నారట. 2018 దసరా కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాత్రి అయితే నా గదికి వచ్చి కౌగిలించుకోవాలని కోరేవాడు: బాలీవుడ్ నటి స్వర భాస్కర్