Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్.. పవన్ కల్యాణ్ క్లాప్..

'జైలవకుశ' తర్వాత తారక్‌ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. తారక్‌కెరీర్‌లో ఇది 28వ చిత్రం. సోమవారం ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి పవర్‌స్టార్‌ ప

Advertiesment
త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్.. పవన్ కల్యాణ్ క్లాప్..
, ఆదివారం, 22 అక్టోబరు 2017 (17:21 IST)
'జైలవకుశ' తర్వాత తారక్‌ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. తారక్‌కెరీర్‌లో ఇది 28వ చిత్రం. సోమవారం ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ముఖ్య అతిథిగా రానున్నారు. 
 
ఈ సినిమాకు పవన్ కల్యాణ్ క్లాప్ కొట్టనున్నారు. 2018 జనవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరగనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించనున్న ఎన్టీఆర్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ స్వరకర్తగా వ్యవహరించనున్నారు.
 
మరోవైపు పవన్‌ కల్యాణ్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మరో చిత్రం రాబోతోంది. ఈ సినిమాకు ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. ఇందులో పవన్‌కి జోడీగా అను ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేశ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్కినేని సమంత, చైతూ రిసెప్షన్ ఫోటోలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్