ఆమె అందానికి ఫిదా... రూ.కోట్లు ఇచ్చిన బిగ్‌బాస్ నిర్వాహకులు (video)

Webdunia
బుధవారం, 6 నవంబరు 2019 (17:54 IST)
బిగ్ బాస్ 3 సీజన్ ముగిసింది. ఫైనల్ విజేతగా రాహుల్ నిలువగా, రన్నరప్‌గా బుల్లితెర యాంకర్ శ్రీముఖి నిలిచారు. అయితే, శ్రీముఖి భారీ రెమ్యూనరేషన్‌ రూపంలో ఇంటికి తీసుకువెళ్లిందనే ప్రచారం సాగుతోంది. ఆమె అందానికి ఫిదా అయిన నిర్వాహకులు ఆమె అడిగినంత సమర్పించుకున్నట్టు తెలుస్తోంది. 
 
నిజానికి బుల్లితెరపై తిరుగులేని యాంకర్‌గా శ్రీముఖి సత్తా చాటుతోంది. అలాగే, బిగ్ బాస్ హౌస్‌లోనూ అద్భుత నటనను ప్రదర్శించింది. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండేందుకు రోజుకు రూ.లక్ష డిమాండ్‌ చేసినట్టు సమాచారం. 
 
ఆమె పాపులారిటీకి ఫిదా అయిన నిర్వాహకులు షోకు సైన్‌ చేసేముందు పునరాలోచన లేకుండా ఆమె అడిగిన మొత్తం ఇచ్చేందుకు అంగీకరించారని తెలిసింది. అలా, 105 రోజులు బిగ్‌బాస్‌ హౌస్‌లో శ్రీముఖి కొనసాగడంతో కాంట్రాక్టు ప్రకారం రూ.1.05 కోట్ల చెక్‌ ఆమె అందుకున్నట్టు సమాచారం. బిగ్ బాస్ 3 టైటిల్ విజేత రాహుల్‌ సహా ఇతర హౌస్‌మేట్స్‌తో పోలిస్తే ఆమె రెమ్యూనరేషన్‌ చాలా అధికం కావడం గమనార్హం. 
 
కాగా, 14 మంది కంటెస్టెంట్లలో ఒకరిగా బిగ్‌బాస్‌ తెలుగు 3 హౌస్‌లో అడుగుపెట్టిన శ్రీముఖి ఏకంగా 105 రోజుల పాటు హౌస్‌లో కొనసాగడంతో పాటు టాప్‌ 5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచారు. గ్రాండ్‌ ఫినాలేలో టైటిల్‌ను రాహుల్‌ సిప్లీగంజ్‌ ఎగరేసుకుపోవడంతో ఆమె రన్నరప్‌గా మిగిలారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుజరాత్ రాష్ట్ర మంత్రిగా రవీంద్ర జడేజా సతీమణి

నిమ్స్‌లో వైద్య విద్యార్థి ఆత్మహత్య

ప్రపంచంలోనే మూడో అత్యంత శక్తిమంతైన వైమానిక శక్తిగా భారత్

అమరావతి: రాజధాని అభివృద్ధికి రైతుల అండ.. భూమిని విరాళంగా ఇవ్వడంపై చర్చ

పంజాబ్ సీనియర్ ఐపీఎస్ అధికారి అవినీతి బాగోతం.. ఇంట్లో నోట్ల కట్టలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments