ఎట్టకేలకు బిగ్ బాస్-3 షో ముగిసి రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ షోలో ప్రధానంగా ముగ్గురు కంటెన్టెంట్‌ల పైనే చర్చ కూడా జరిగింది. మొదటగా శ్రీముఖి, బాబా భాస్కర్, ఆ తరువాత రాహుల్. బయటకు వెళ్ళి వచ్చిన రాహుల్ గెలవడం అసాధ్యమని అందరూ అనుకున్నారు.
కానీ అనూహ్యంగా అతనే గెలిచాడు. అయితే బిగ్ బాస్-3 షోలో బాబా భాస్కర్‌కు శ్రీముఖికి మధ్య కెమిస్ట్రి నడిచిందని ప్రచారం సాగింది. బాబా భాస్కర్ తాను గెలవకపోయినా శ్రీముఖిని గెలిపించేందుకే ప్రయత్నిస్తున్నాడన్న ప్రచారం పెద్దఎత్తున జరిగింది.
అయితే బాబా భాస్కర్ అసలు విషయాన్ని బయటపెట్టాడు. నాకు శ్రీముఖికి మధ్య లింక్ అంటగట్టారు. ఇదంతా మామూలే. అయితే శ్రీముఖి నాకు చెల్లెలు లాంటిది. నా కుటుంబంలో నా భార్య, నాకు మధ్య గొడవలు జరిగాయని కూడా చెప్పారు. ఇందులో ఏమాత్రం నిజంలేదు అన్నాడు బాబా భాస్కర్.