Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విన్నర్ ఎవరో తేలిపోనుంది.. బాబా భాస్కర్ బిగ్ బాస్‌తో మాట్లాడాడు..

Advertiesment
Bigg boss
, గురువారం, 31 అక్టోబరు 2019 (15:45 IST)
బిగ్ బాస్ మూడో సీజన్ ఫైనల్‌లో ఐదుగురు సభ్యులు పోటీ పడుతున్నారు. ఆది నుంచి తమ ప్రదర్శనతో ఆకట్టుకుని బాబా భాస్కర్, శ్రీముఖి, రాహుల్, వరుణ్, అలీలు ఫినాలేకు చేరుకున్నారు. వీరిలో ఒక్కరే విన్న‌ర్‌గా నిలవనున్నారు. ఆ విన్నర్ ఎవరో ఈ ఆదివారం ఎపిసోడ్లో తేలిపోనుంది. ఇక ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం శ్రీముఖి లేదా రాహుల్‌లో ఒకరు విన్నర్‌గా నిలిచే అవకాశాలున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
 
అలాగే వరుణ్, అలీలకు గెలిచే అవకాశాలు లేవని కూడా చర్చ నడుస్తుంది. అయితే బాబా భాస్కర్ కూడా రాహుల్, శ్రీముఖిలకు గట్టి పోటీ ఇస్తున్నట్లు కనబడుతుంది. మొదటి నుంచి హౌస్‌లో అందరితో మంచిగా ఉన్న బాబా తన కామెడీతో అలరించారు. అలాగే రోజు వంట చేస్తూ లేడీ ప్రేక్షకుల మద్దతు కూడా సంపాదించుకున్నారు. కాకపోతే బాబాకు రాహుల్, శ్రీముఖిలు లాగా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ లేదు.
 
ఇదే ఒక్కటే మైనస్ అవుతుంది తప్ప మిగతా విషయాల్లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక తాజాగా బిగ్ బాస్ బుధవారం ఎపిసోడ్‌లో బాబా అంటే ఏంటో తన జర్నీని చూస్తే అర్థమవుతుంది. మామూలుగా కొందరు కంటెస్టంట్స్ బాబాని మాస్కర్, ఊసరవెల్లి అంటూ నెగిటివ్‌గా మాట్లాడారు. అయితే అవేమీ నిజాలు కాదని బాబా ఫుల్ ఎమోషనల్ అవుతూ బిగ్ బాసుతో మాట్లాడాడు. అయినా ఈ వారం విన్నర్ ఎవరో తేలిపోనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొరటాలతో చిరంజీవి సినిమా.. ముదురు హీరోయిన్‌ కన్ఫార్మ్