Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చివరికి వంటలక్క చేతిలో నాగ్ ఓడిపోయాడే..! (video)

Advertiesment
చివరికి వంటలక్క చేతిలో నాగ్ ఓడిపోయాడే..! (video)
, బుధవారం, 30 అక్టోబరు 2019 (15:38 IST)
సినిమాల కంటే.. సీరియల్స్‌కు ప్రస్తుతం క్రేజ్ అమాంతం పెరిగిపోతోంది. బుల్లితెరపై ప్రతిరోజు ప్రేక్షకులను పలకరిస్తున్న సీరియల్స్‌కు మంచి రేటింగ్ వచ్చేస్తోంది. ప్రస్తుతం బాగా పాపులర్ అయిన బిగ్ బాస్ రియాల్టీ షో కూడా సీరియల్స్ రేటింగ్‌తో పోటీపడలేకపోయింది. ముఖ్యంగా కార్తీకదీపం సీరియల్‌తో పెద్ద పెద్ద టీవీ షోలే కుదేలవుతున్నాయి. 
 
ఇప్పటికే ప్రతివారం విడుదల చేసే బార్క్ రేటింగ్స్‌లో కార్తీక దీపం సీరియల్ దూసుకెళ్తోంది. తాజాగా విడుదల చేసిన 42వ వారం రేటింగ్స్‌లో సైతం కార్తీక దీపం అగ్రస్థానంలో వుంది. తర్వాతి స్థానాల్లో ఇస్మార్ట్ శంకర్ సినిమా, ఆపై వదినమ్మ, కోయిలమ్మ, మౌనరాగం సీరియల్స్ వున్నాయి. అంతేకాకుండా.. తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్‌ఫుల్ షోగా ముద్ర వేసుకున్న బిగ్ బాస్ రియాలిటీ షో సైతం కార్తీక దీపం సీరియల్ రేటింగ్స్ ముందు వెనుకబడిపోయింది. 
 
స్టార్ హీరో నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షోకు భారీ హైప్ వుంది. అయితే బిగ్ బాస్ పబ్లిసిటీ కార్తీక దీపం వెలుగు ముందు వెలవెల పోయింది.  తాజా రేటింగ్స్‌లో టాప్-5 ప్రోగ్రామ్స్‌లో అసలు బిగ్ బాస్ లేకపోవడమే ఇందుకు నిదర్శనం. దీనినిబట్టి బిగ్ బాస్ కంటే.. టీవీ సీరియల్స్‌నే జనాలు అధికంగా చూస్తున్నారు. 
webdunia
 
నిజానికి కార్తీకదీపం సీరియల్ విశేష ఆదరణతో ఇప్పటికే రికార్డు స్థాయిలో టీఆర్పీలను అందుకుంటూ దూసుకెళుతోంది. అయితే వంటలక్క అభిమానులు మాత్రం.. స్టార్ హీరో నాగార్జున హోస్ట్ చేసే బిగ్ బాస్‌నే వెనక్కి నెట్టడంపై తెగ ఖుషీ ఖుషీగా వున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్‌కు సత్తిరి బిత్తిరి వెళ్లవద్దన్నాడు.. శివజ్యోతి సంచలన వ్యాఖ్యలు