Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నయనతార #LoveActionDrama కు సూపర్ రెస్పాన్స్.. రివ్యూ రిపోర్ట్

Advertiesment
నయనతార #LoveActionDrama కు సూపర్ రెస్పాన్స్.. రివ్యూ రిపోర్ట్
, గురువారం, 5 సెప్టెంబరు 2019 (13:17 IST)
లేడీ సూపర్ స్టార్ నయనతార తాజా సినిమా లవ్ యాక్షన్ డ్రామా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ.. నయనతార మాతృభాష మలయాళంలో మాత్రం గ్యాప్ తీసుకుంటూ నటిస్తూ వస్తోంది. 2016లో పుథియనియమం తర్వాత మలయాళ సినిమాలకు దూరంగా ఉన్న నయన మూడేళ్ల విరారం తర్వాత లవ్ యాక్షన్ డ్రామాతో మాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించనుంది. 
 
ఈ చిత్రంలో నివిన్ పాల్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ధ్యాన్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించాడు. శోభ అనే పాలక్కడ్ ప్రాంతానికి చెందిన బ్రాహ్మణ యువతిగా నయనతార ఇందులో కనిపించింది. భార్య తనను హతమార్చుతుందనే మానసిక వ్యాకులతతో బాధపడే ఓ భర్త కథతో ఆద్యంతం వినోదభరితంగా ఈ సినిమా సాగుతోంది.
 
గురువారం విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. రొమాంటిక్ యాక్షన్ డ్రామా ఈ సినిమా తెరకెక్కింది. స్క్రిప్ట్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని అజు, విశాఖ్ సుబ్రహ్మణ్యన్ సంయుక్తంగా నిర్మించారు. 
 
కథలోకి వెళితే.. ఆత్మన్యూనతా భావంతో వున్న ఓ వ్యక్తి తన భార్య పట్ల ఎలా ప్రవరిస్తాడనే అంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. మోస్తరుగా వున్న వ్యక్తి తన అందమైన భార్యను ఎలా ఇంప్రెస్ చేశాడు. ఆమె ప్రేమను ఎలా పొందాడు అనేదే కథ. 
 
పెర్‌ఫార్మెన్స్: నివిన్, నయనతార అద్భుతంగా నటించారు. పాత్రల్లో జీవించారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరింది. ఇదే సినిమాకు హైలైట్ ఇక మిగిలిన పాత్రల్లో దుర్గా కృష్ణ, బేసిల్ జోసెఫ్, శ్రీనివాసన్ తదితరులు ఒదిగిపోయారు. ఈ సినిమాకు సంబంధించి ట్విట్టర్లో ప్రేక్షకులు తమ అభిప్రాయాలను పోస్టు చేస్తున్నారు. ప్రేక్షకులందరూ సినిమాకు పాజిటివ్ రిజల్ట్ ఇచ్చారు. 
webdunia
 
ఈ సినిమా తొలి అర్థభాగం ఆసక్తికరంగా వుందని.. రిచ్‌గా మేక్ చేశారని.. నటీనటులు అద్భుత నటనను కనబరిచారని కితాబిస్తున్నారు. రెండో భాగం కూడా సినిమాను ఆసక్తి వైపు తీసుకెళ్తుందని... జోకులు క్లిక్ అయ్యాయని కామెంట్ చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐశ్వర్యా రాయ్ ఔట్... చిరంజీవి సరసన గోవా బ్యూటీ....?