Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజకీయాలే కాశ్మీర్‌కు సమస్య అని చెప్పే 'ఆపరేషన్‌...'

రాజకీయాలే కాశ్మీర్‌కు సమస్య అని చెప్పే 'ఆపరేషన్‌...'
, శుక్రవారం, 18 అక్టోబరు 2019 (17:25 IST)
నటీనటులు : ఆది, సాషా చెత్రి, అనీష్‌ కురువిల్లా, మనోజ్‌ నందం, కార్తీక్‌ రాజు, పార్వతీశం, నిత్య నరేష్‌, క ష్ణుడు, రావు రమేష్‌
 
సాంకేతికవర్గం: సినిమాటోగ్రఫర్‌ : జైపాల్‌ రెడ్డి, సంగీతం : శ్రీ చరణ్‌ పాకాల, ఎడిటర్‌ : గ్యారీ బిహెచ్‌, నిర్మాతలు : ప్రతిభా అడవి, కట్టా ఆశిష్‌ రెడ్డి, కేశవ్‌ ఉమా స్వరూప్‌, పద్మనాభ రెడ్డి, గ్యారీ బిహెచ్‌, సత్ష్‌ డేగలదర్శకత్వం: అడివి సాయి కిరణ్‌
 
టైటిల్‌నుబట్టే ఇది దేశానికి సంబంధించిన సీక్రెట్‌ ఆపరేషన్‌ అనే అర్థమైపోతుంది. ముఖ్యంగా కాశ్మీర్‌ సమస్య ఎన్నో ఏళ్లుగా రగులుతూనే వుంది. అలాంటి క్రిటికల్‌ సమస్యను తీసుకుని చిత్రంగా మలచడం అనేది పలు చిత్రాల్లో చూసేశాం. కానీ ఇందులో కాశ్మీరీ పండిట్స్‌ యొక్క సాధకభాధలు తెలియజెప్పే పాయింట్‌ అని ముందునుంచి చిత్ర యూనిట్‌ చెబుతోంది. మెచ్యూర్డ్‌ చిత్రాలు రూపొందించే సాయికిరణ్‌ అడివి దర్శకత్వం వహించడం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.  ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా, ప్రముఖ రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా రూపొందిన సినిమా 'ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌' (ఒ.జి.యఫ్‌). ఈరోజే విడుదలైంది. అదెలా వుందో చూద్దాం. 
 
కథ :
కాశ్మీర్‌లో జిహాద్‌ అంటూ పోరాడే టెర్రరిస్టుల గురించి చెప్పాలంటే.. అంతకుముందు ఏం జరిగిందనేది చెబుతూ కథ రన్‌ అవుతుంది. స్వాతంత్య్రానంతరం జిన్నా, నెహ్రూల చేసిన విధానం నుంచి చెబుతూ.. అప్పటినుంచి హిందువులైన కాశ్మీర్‌ పండిట్‌ను ఏవిధంగా ఊచకోత కోసిందే చూపిస్తారు. అలా 1990లో కాశ్మీర్‌ పండిట్లను ముస్లిం మతంలో మారాలనీ, లేదంటే కాశ్మీర్‌ని వదిలి వెళ్లిపోవాలని ఘాజీ బాబా (అబ్బూరి రవి) మాట విననివారిని అతి దారుణంగా చంపుతాడు. 
 
అలా చిన్నవయస్సులోనే అర్జున్‌ పండిట్‌ (ఆది సాయి కుమార్‌) తల్లిదండ్రులు కూడా ప్రాణాలు కోల్పోతారు. దాంతో చిన్నప్పటి నుండే అర్జున్‌ ఘాజీ బాబా మీద కసితోనే ఎన్‌.ఎస్‌.జి కమాండోగా అవుతాడు. ఘాజీ బాబాని రిస్క్‌ చేసి పట్టుకుంటాడు. అయితే ఘాజీని విడిపించుకోవడానికి అతని ప్రధాన అనుచరుడు ఫారూఖ్‌ (మనోజ్‌ నందం) సెంట్రల్‌ మినిష్టర్‌ శర్మ (రావు రమేష్‌) కూతురుని టార్గెట్‌ చేస్తాడు. ఆ తర్వాత అర్జున్‌ ఏం చేశాడు? తదనంతర పరిణామాలు ఏమిటి? అనేది మిగిలిన కథ.
 
విశ్లేషణ:
కాశ్మీర్‌ సమస్య చాలా సున్నితమైంది. స్వాతంత్య్రానికి ముందు ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు సంభవించాయనేది అసలైన చరిత్ర చదివిన వారికి తెలుస్తుంది. కానీ అవేవీ సామాన్య ప్రజలకు అందుబాటులో లేవు. హిందూవు అనేవాడిని ఊచకోతకోసి పైశాసికానాందాన్ని ముస్లిం తీవ్రవాదులు పొందేవారు. కథ ఆ మార్గంలోంచి తీసుకువచ్చే పెద్ద సినిమా అయ్యేది. కానీ ఒక కాశ్మీర్‌ పండిట్‌ కుటుంబానికి చెందని వ్యక్తి తీవ్రవాది ఘాజీబాబాను ఎలా పట్టుకున్నాడు. తర్వాత పై అధికారుల ఒత్తిడితో ఎలా విడిచిపెట్టాడనేది ఇందులో చూపించారు. 
 
ప్రజల్ని ఊచకోత కోయడం ఇన్నేళ్ళుగా కాశ్మీర్‌ సమస్య పరిష్కారం కాకపోవడం అనేది కేవలం రాజకీయ లబ్దికోసం కొందరు ఆడుతున్న నాటకం. దీన్ని సరిగ్గా హైలైట్‌ చేస్తే చిత్రం అద్భుతంగా వుండేది. అయితే దేశం కోసం ఎంతోమంది పండిట్‌లు త్యాగం చేసిన విధానం కలచివేస్తుంది. అక్కడ ఒక్కోరిది ఒక్కో చరిత్ర అని చిత్ర యూనిట్‌ ప్రారంభంనుంచే చెబుతుంది. దాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించేవిధంగా చేస్తే మరింత ఆకట్టుకునేది. అయినా మంచి ప్రయత్నం చేశారనే చెప్పాలి. ఎన్‌.ఎస్‌.జి ఆఫీసర్స్‌ తమ కుటుంబాల్ని త్యాగం చేసైనా సరే దేశాన్ని ఎలా కాపాడుతున్నారనేది చక్కగా చూపారు. 
 
ఆది సాయికుమార్‌, ఎన్‌.ఎస్‌.జి కమాండో అర్జున్‌ పండిట్‌ పాత్రలో బాగా నటించాడు. ఆర్‌ఎస్‌ఎస్‌. నేపథ్యం నుంచి వచ్చిన రాజకీయ నాయకుడిగా రావు రమేష్‌ నటించాడు. పతాక సన్నివేశంలోనూ ఆర్టికల్‌ 360ను రద్దు చేయడంతో కాశ్మీరీలు హాయిగా తమ భూమి అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారంటూ ఇచ్చిన బాగుంది. అయినా ఇది కేవలం మోడీ నిర్ణయాలను బలపరుస్తూ చేసినట్లుగా వుంది. ఇక ఇందులో ఝాజీబాబాగా అబ్బూరి రవి నప్పాడు. అయితే ఆ పాత్రను అతను చేస్తున్నాడని ముందుగానే ప్రకటించకుండా వుంటే చూసే ప్రేక్షకుడు థ్రిల్‌కు గురయ్యేవాడు. 'ఎయిర్‌ టెల్‌' మోడల్‌ శషా చెట్రి, కార్తీక్‌ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్‌, కృష్ణుడు, పర్వాలేదనిపించారు. 
 
అయితే ఇందులో కథనంలో సస్పెన్స్‌ అనేది లేకుండా చేయడం చిత్రంలో ప్రధాన లోపం. కథను మరింత ఆసక్తిగా తీసేట్లు స్క్రీన్‌ప్లేను రాసుకుంటే బాగుండేది. కేంద్రమంత్రి కూతురుని కిడ్నాప్‌ చేయడానికి మనోజ్‌ నందం గ్యాంగ్‌ ఇండియాకి వచ్చి కిడ్నాప్‌కి ప్లాన్‌ చేయడం అనేది జరిగిన సంఘటనే అయినా దాన్ని సినిమాటిక్‌ మార్చేసి తీశారు. ఖాజీ బాబాని విడిపించుకునే ప్రయత్నంలో వచ్చే సీన్స్‌లో సగం సీన్స్‌ లేకపోయినా కథకు వచ్చే నష్టం ఏమిలేదు. 
 
ఇంత సీరియస్‌ కథలో కాలేజీ లవ్‌ ఎపిసోడ్స్‌తో మిళితం చేసి యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే అంతగా అది వర్కవుట్‌ కాలేదనే చెప్పాలి. టెక్నికల్‌గా కెమెరామెన్‌ అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకే హైలెట్‌గా నిలుస్తోంది. సంగీతం పర్వాలేదు. అయితే ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే సాంగ్‌ ఓకే. దర్శకుడు మంచి కథాంశం తీసుకున్నా.. ఆ కథాంశానికి తగ్గట్లు ఉత్కంఠభరితమైన కథనాన్ని మాత్రం చూపించలేకపోయాడు. కొన్ని లోపాలున్నా మొత్తంగా ఈ చిత్రం మంచి ప్రయత్నమే అని చెప్పాలి. అయితే మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
 
రేటింగ్‌: 5/2.75

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎయిర్‌పోర్టులో తళుక్కుమన్న సమంత.. కెమెరాలకు పనిచెప్పిన ఫోటోగ్రాఫర్లు