గద్దలకొండ ఆది అంటే గజగజ వణకాలా..? హైపర్ ఆది (video)

గురువారం, 3 అక్టోబరు 2019 (11:50 IST)
జబర్దస్త్ శుక్రవారం కామెడీ పంట పండించబోతోంది. ఈ వారం ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకోబోతున్నాయి. ముఖ్యంగా  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ పాత్రలో హైపర్ ఆది కిరాక్ పుట్టించే కామెడీ చేయనున్నాడు. గద్దలకొండ ఆది అంటే గజగజ వణకాలా.. అంటూ సూపర్ డైలాగులు విసురబోతున్నాడు. 
 
ఎప్పటిలాగే తన పంచ్‌లు, ప్రాసలతో నవ్వుల పండుగను అందించబోతున్నాడు. విశేషమేమిటంటే.. గురువారం వస్తున్న షోలో బిగ్‌బాస్ ఫేమ్ రోహిణి కూడా నటించబోతోంది. ఆదికి భార్యగా రోహిణి నటించింది. స్కిట్‌లో భాగంగా.. హైపర్ ఆది తన భార్య(రోహిణి)ను ఓ ముద్దు ఇవ్వు అని అడగ్గా ఆమె ఇవ్వనని తెగేసి చెబుతుంది. 
 
అక్కడున్న యాంకర్ అనసూర మధ్యలో కలగజేసుకొని ఆది.. నేను ఇస్తాను రా అంటూ పిలిచింది. వెంటనే అనసూయ నేనొస్తున్నా అంటూ వెళ్లగానే.. ఏదో ఫ్లోలో అన్నాను.. వద్దు దగ్గరికి రావొద్దంటూ నవ్వులు పూయించింది. అటు.. రాకెట్ రాఘవ, అదిరే అభి కూడా తమ స్కిట్లతో అలరించారు. దీనికి సంబంధించి విడుదలైన ప్రోమో కూడా ఓ రేంజ్‌లో పేలిపోయింది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. 
 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం క్యాన్సర్‌పై పోరాటం చేస్తా.. తండ్రిని అలా కోల్పోయా.. సన్నీ లియోన్