వేణుమాధవ్‌పై అలాంటి ప్రచారం ఆపండి.. నేను చూసొచ్చాను.. జబర్దస్త్ రాకేష్

బుధవారం, 25 సెప్టెంబరు 2019 (11:16 IST)
హాస్యనటుడు వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా వుందని మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ స్పందించారు. వేణు మాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని.. ఆయన మృతి చెందారని వస్తున్న వార్తలు నిజం కాదన్నారు.

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని రాకేష్ ఖండించారు.  వేణుమాధవ్ బాగుండాలని అందరూ కోరుకోవాలని.. దయచేసి ఇలాంటి పరిస్థితుల్లో దుష్ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
 
ఆయన మన మధ్య లేరని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై రాకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి సోషల్ మీడియా నియంత్రణ పాటించాల్సిందిగా కోరారు. తాను స్వయంగా ఆస్పత్రికి వెళ్లి వేణు మాధవ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నానని.. ఆయన శరీరం చికిత్సకు సహకరిస్తోందని, కోలుకుంటున్నారని చెప్పారు. 
 
ఆయన చనిపోయారంటూ టీవీల్లో వస్తున్న వార్తలు చూసి వేణు మాధవ్ తల్లి కలత చెందారని వాపోయారు. ఇలాంటి తరుణంలో ఏం చేయాలో తెలియక.. ట్విట్టర్ వీడియో ద్వారా అందరికీ ఈ విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం భార్యకు దూరమై.. ప్రియురాలితో సల్లాపాలు.. చితకబాదిన భార్య