Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ఛలో'' హిట్.. నర్తనశాలకు నాగశౌర్య రెడీ.. మధ్యలో కోనవెంకట్‌తో వివాదం ఎందుకు?

ఛలో, కణం సినిమాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న నాగశౌర్య.. స్క్రిప్ట్ ఎంచుకునే విషయంలో జాగ్రత్త పడుతున్నాడు. ఛలో సినిమా భారీ కలెక్షన్లు సాధించిన నేపథ్యంలో.. నాగశౌర్య 'నర్తనశాల' అనే కొత్త సినిమాల

Webdunia
శనివారం, 24 మార్చి 2018 (12:03 IST)
ఛలో, కణం సినిమాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న నాగశౌర్య.. స్క్రిప్ట్ ఎంచుకునే విషయంలో జాగ్రత్త పడుతున్నాడు. ఛలో సినిమా భారీ కలెక్షన్లు సాధించిన నేపథ్యంలో.. నాగశౌర్య 'నర్తనశాల' అనే కొత్త సినిమాలో నటించనున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. వచ్చేనెల 12వ తేదీన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 
 
ఈ సినిమాకు శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నాడు. 'ఛలో' సినిమాకి సంగీతాన్ని అందించి మంచి మార్కులు కొట్టేసిన సాగర్‌ను ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందే ఈ సినిమాలో కథానాయికగా మెహ్రీన్‌ను తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
 
ఇదిలా ఉంటే.. ''ఛలో'' సినిమా సక్సెస్ తర్వాత నాగశౌర్య వైఖరి మారిందని, రెమ్యూనరేషన్ ఉన్నట్టుండి పెంచేశాడని, ఇప్పుడేమో స్క్రిప్ట్ నచ్చలేదంటున్నాడని కోన వెంకట్ నాగశౌర్యమీద విమర్శలు గుప్పించాడు. అయితే నాగశౌర్య తండ్రి శంకర్ ప్రసాద్ మాత్రం కోన వెంకటే ఆరోపణల్లో నిజం లేదని చెప్తున్నారు. 
 
నిజానికి యువ దర్శకుడు సాయి శ్రీరామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి నాగశౌర్య అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. ఈ సినిమాని కోన వెంకట్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా చేయడానికి ఒప్పుకోవడం నిజమే కానీ.. దానికి పూర్తి స్ర్కిప్ట్ ఇవ్వలేదని చెప్పారు. ఆ సినిమా కోసం శౌర్య గెడ్డం పెంచుకొని మరీ ఎదురుచూస్తుంటే కోన వెంకట్, దర్శకుడు సాయి శ్రీరామ్‌ను వేరే ప్రాజెక్ట్ గురించి వైజాగ్ తీసుకెళ్లడం ఎంతవరకూ సమంజసమని మండిపడ్డార. మరి నాగశౌర్య, కోన వెంకట్‌ వివాదం ఎలా ముగుస్తుందో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధానితో పవన్ కల్యాణ్ భేటీ.. పార్లమెంట్ సమావేశాల మధ్య...?

'ఆర్ఆర్ఆర్‌'పై థర్డ్ డిగ్రీ ప్రయోగం... కటకటాల వెనక్కి సీఐడీ మాజీ ఏఎస్పీ

ఆటో నడుస్తుండగానే రిపీర్ చేశాడు.. వీడియో వైరల్ (video)

జగన్ - అదానీల విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలి : వైఎస్ షర్మిల

బోరుగడ్డ అనిల్‌ రాచమర్యాదలకు రూ.5 లక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments