Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అర్జున్ రెడ్డి ''ట్యాక్సీవాలా'' వీడియో

అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ తాజా సినిమా ''ట్యాక్సీవాలా''. తాజాగా ట్యాక్సీవాలా ఫస్ట్‌ గేర్ పేరిట యూవీ క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ 2 పిక్చర్స్ తమ యూట్యూబ్ ఛానెళ్లలో ఈ వీడియోను విడుదల చేశాయి. ఈ వ

Advertiesment
అర్జున్ రెడ్డి ''ట్యాక్సీవాలా'' వీడియో
, శనివారం, 24 మార్చి 2018 (08:46 IST)
అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ తాజా సినిమా ''ట్యాక్సీవాలా''. తాజాగా ట్యాక్సీవాలా ఫస్ట్‌ గేర్ పేరిట యూవీ క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ 2 పిక్చర్స్  తమ యూట్యూబ్ ఛానెళ్లలో ఈ వీడియోను విడుదల చేశాయి. ఈ వీడియోలో అర్జున్ రెడ్డి ట్యాక్సీని వేగంగా నడుపుతూ.. కారుపై ఉన్న దుమ్మును దులిపేస్తాడు. త్వరలో ఈ సినిమా టీజర్ విడుదల కానుంది. 
 
పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న విజయ్‌ దేవరకొండ హీరోగా ప్రియాంక జ్వల్కర్‌, మాళవిక నాయర్ హీరోయిన్లుగా రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ''ట్యాక్సీవాలా'' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదివరకే ఈ చిత్ర ప్రిలుక్‌ పోస్టర్‌‌ను విడుదల చేశారు. 
 
ఆ పోస్టర్‌లో కేవలం కారు మాత్రమే ఉండటంతో.. అర్జున్‌రెడ్డి తదుపరి చిత్రం ఎలా ఉండబోతుందోననే ఆసక్తి పెరిగింది. ట్యాక్సీవాలా విజయ్ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పిన నిర్మాతలు.. మే 18న ఈ మూవీని విడుదల చేసేందుకు సన్నాహలు చేస్తున్నారు. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ''మహానటి''లో విజయ్ నటిస్తున్నాడు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హాట్ యాంకర్ అనసూయ అలా అయితే... సాక్షి మాజీ టీవీ యాంకర్ శ్రీరెడ్డి ఇలా ఎందుకైంది?