Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''ఏ మంత్రం వేసావే'' రివ్యూ: అర్జున్ రెడ్డికి అవసరమా?

కథ గురించి పట్టించుకోకుండా అర్జున్ రెడ్డి నటించిన సినిమా ఏ మంత్రం వేసావే. ఇందులో అర్జున్ రెడ్డి నటన, ఆహార్యం, భాష్యం చిత్రవిచిత్రంగా ఉంటాయి. క్యారెక్టర్‌లో క్లారిటీ లేదు. ఈ చిత్రం విజయ్ దేవరకొండ కెరీర

Advertiesment
Ye Mantram Vesave
, శనివారం, 10 మార్చి 2018 (15:20 IST)
సినిమా పేరు: ఏ మంత్రం వేసావే
తారాగణం: విజయ్ దేవరకొండ, శివానీ సింగ్, ఆశీష్ రాజ్ తదితరులు. 
దర్శకత్వం: శ్రీధర్ మర్రి 
సంగీతం: అబ్బత్ సమత్ 
కెమెరా: శివారెడ్డి 
నిర్మాత: మల్కాపురం శివకుమార్ 
విడుదల తేదీ: 09-03-2018 
 
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ''ఏ మంత్రం వేసావే'' సినిమా శుక్రవారం విడుదలైంది. "అర్జున్ రెడ్డి"తో భారీ క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ''ఏ మంత్రం వేసావే'' చిత్రంతో ఏమేరకు ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడో వేచి చూడాలి. 
 
కథా సారాంశం 
ఫేస్‌బుక్‌లో పరిచయమైన రాగ్స్ (శివానీ సింగ్) కోసం గేమర్ కమ్ హ్యాకర్ అయిన నిక్కీ (విజయ్ దేవరకొండ) ఎలాంటి పోరాటం చేస్తాడు. తన చుట్టూ వున్న కుట్రల్ని ఎలా అధిగమించాడు. ఇంతకీ నిక్కీ చుట్టూ వల పన్నిన వాళ్లెవరు? నిక్కీ ద్వారా ఏం సాధించాలనుకున్నారు? చివరికి నిక్కీ ఇష్టపడిన రాగ్స్‌ను ఎలా సొంతం చేసుకున్నాడు అనేదే కథ.
 
విశ్లేషణ: 
కథ గురించి పట్టించుకోకుండా అర్జున్ రెడ్డి నటించిన సినిమా ఏ మంత్రం వేసావే. ఇందులో అర్జున్ రెడ్డి నటన, ఆహార్యం, భాష్యం చిత్రవిచిత్రంగా ఉంటాయి. క్యారెక్టర్‌లో క్లారిటీ లేదు. ఈ చిత్రం విజయ్ దేవరకొండ కెరీర్‌కి ఒక మచ్చలా మిగిలిపోతుందని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. హీరోయిన్ కూడా ఎక్స్‌ప్రెషన్స్ చూపించలేకపోయింది. సినిమా మొత్తం ప్రేక్షకులను చిరాకు తెప్పించింది. 
 
హీరో, హీరోయిన్స్ ఫ్రెండ్స్‌ను ప్రేక్షకులను భరించడం చాలా కష్టం. ఇక నెగటివ్ రోల్‌లో కనిపించిన కుర్రాడు పర్వాలేదనిపించాడు. సోషల్ మీడియాలో మనుషుల విలువ తగ్గిపోయిందనే సందేశాన్ని చెప్పడం బాగుందే కానీ కథకథనం ఎంచుకోవడంలో దర్శకుడు విఫలమయ్యాడు. 
 
శ్రీధర్ మర్రి "ఏ మంత్రం వేసావే" చిత్రంతో ప్రేక్షకులకు చుక్కలు చూపించాడు. ఇక మిగతా సాంకేతిక నిపుణులు కూడా ఆశించినంత వరకు రాణించలేకపోయారు. మొత్తానికి ఏ మంత్రం వేసావే చూసేందుకు బదులు ప్రేక్షకులు అర్జున్ రెడ్డిని ఇంకోసారి చూసేస్తే బెటర్.
 
రేటింగ్: 1/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఛల్ మోహన్ రంగ' 'పెద్దపులి' అంటూ పాడుతూ చిందేస్తున్న 'నితిన్'