Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుత్తా జ్వాల- విశాల్ విష్ణు పెళ్లి సందడి.. మెహందీతో మెరిసిన జ్వాల

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (15:35 IST)
Jwala
బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల.. తమిళ హీరో విష్ణు విశాల్ కాసేపట్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట మరొకాసేపట్లో వధూవరులుగా మారనున్నారు. నేడు పెళ్లిబంధంతో ఒక్కటి కాబోతున్న గుత్తా జ్వాల-విశాల్ విష్ణు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
తాజాగా మెహందీ ఫంక్షన్ తో జ్వాల ఇంట సందడి మొదలైంది. పెళ్లికూతురుగా ముస్తాబైన జ్వాల మెరిసిపోతూ కనిపించింది. అయితే కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో అతి కొద్ది మంది అతిథుల సమక్షంలోనే ఈ జంట ఒకటవుతోంది. ఉగాది రోజున తమ లగ్న పత్రికను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన హీరో విష్ణు విశాల్‌..కరోనా కారణంగా అందరికీ ఆహ్వానాలు పంపడం లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 
 
అయితే వీరిద్దరికి ఇది రెండో వివాహం. 2010లో రజనీ నటరాజన్‌ను పెళ్లి చేసుకున్న విష్ణు విశాల్‌ 2018లో ఆమెతో విడాకులు తీసుకున్నారు. భారత బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ చేతన్‌ ఆనంద్‌ను 2005లో వివాహం చేసుకున్న జ్వాల 2011లో అతనితో విడాకులు తీసుకున్నారు. 
Jwala
 
విశాల్‌ సోదరి పెళ్లి వేడుకల్లో తొలిసారిగా వీరిద్దరూ కలిశారు. అప్పుడు వీరి మధ్య చిగురించిన స్నేహం ప్రేమగా మారగా ఇప్పుడది పెళ్లిపీటలకు దారి తీసింది. జ్వాలా కూడా తన పేరుతో హైదరాబాద్ లో బ్యాండ్మింటన్ అకాడమీ ప్రారంభించింది. అత్యాధునిక సధుపాయాలతో అకాడమీని రన్ చేస్తోంది. నితిన్ గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్‌లో జ్వాలా కనిపించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాంచీలో కనిపించిన తక్షక పాము.. (వీడియో)

ఏక్‌నాథ్ షిండే కలత చెందారు... అయినా నో ఛాన్స్ : కేంద్రమంత్రి రాందాస్

భూమివైపుకు దూసుకొస్తున్న గ్రహశకలం.. ఏమైంది?

ఇస్కాన్ గురువు తరపున వాదించేందుకు ముందుకు రాని బంగ్లా లాయర్లు!!

శ్రీవారి భక్తులకు త్వరలో శుభవార్త చెప్పనున్న తితిదే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

తర్వాతి కథనం
Show comments